Advertisement

  • దిగ్గజ ఆటగాళ్లను కెరీర్ చివర్లో అవమానించడం బీసీసీఐ కి అలవాటయింది..యువరాజ్ సింగ్

దిగ్గజ ఆటగాళ్లను కెరీర్ చివర్లో అవమానించడం బీసీసీఐ కి అలవాటయింది..యువరాజ్ సింగ్

By: Sankar Mon, 27 July 2020 09:08 AM

దిగ్గజ ఆటగాళ్లను కెరీర్ చివర్లో అవమానించడం బీసీసీఐ కి అలవాటయింది..యువరాజ్ సింగ్



యువరాజ్ సింగ్ ఇండియన్ క్రికెట్లో అత్యుత్తమ అల్ రౌండర్లలో ఒకడు ..2007 టి ట్వంటీ ప్రపంచ కప్ , 2011ప్రపంచ కప్ లలో టీమిండియా విజయాలు సాధించడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు ..2011లో అయితే ఇటు బ్యాటింగ్లో , అటు బౌలింగ్లో రాణించి మాన్ అఫ్ ది టోర్నమెంట్ కూడా నిలిచాడు ..దాదాపు పది ఏళ్ళు టీమిండియా లిమిటెడ్ ఓవర్ల ఫార్మటు లో అత్యుత్తమ మ్యాచ్ విన్నర్ గా ఉన్నాడు ..

మరి ఇంతటి దిగ్గజ ఆటగాడు అయినా యువి రిటైర్మెంట్ సమయంలో మాత్రం అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు ..ప్రపంచకప్ విజయం తర్వాత కాన్సర్ భారిన పడ్డ యువి కోలుకొని టీంలోకి వచ్చినప్పటికీ తన మునుపటి ఆటతీరును మాత్రం ప్రదర్శించలేకపోయాడు ..దీనితో టీంలోకి వస్తూ పోతూ చివరకు 2019 ప్రపంచకప్ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాడు..అయితే తాజాగా తన రిటైర్మెంట్ మీద యువి మాట్లాడాడు ..

నా కెరీర్‌ చరమాంకంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు ఏమాత్రం ప్రొఫెషనల్‌గా అనిపించలేదు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్ లాంటి గొప్ప ఆటగాళ్ల‌ని కూడా ఇదే తరహాలో బోర్డు పెద్దలు అవమానించారు. నాకు తెలిసి.. భారత క్రికెట్‌లో ఇలా సెండాఫ్ ఇవ్వడం ఓ భాగమైపోయింది. ఇవన్నీ నేను గతంలోనే చూసి ఉండటంతో.. అవమానకర వీడ్కోలుపై నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు’’ అని యువరాజ్ సింగ్ వెల్లడించాడు.

Tags :
|
|

Advertisement