Advertisement

  • రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న యువరాజ్ సింగ్ పంజాబ్ టీమ్ జాబితాలో...

రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న యువరాజ్ సింగ్ పంజాబ్ టీమ్ జాబితాలో...

By: chandrasekar Wed, 16 Dec 2020 3:41 PM

రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న యువరాజ్ సింగ్ పంజాబ్ టీమ్ జాబితాలో...


వరల్డ్ కప్ 2019 జరుగుతుండగా అంతర్జాతీయ క్రికెట్‌, దేశవాళీ, ఐపీఎల్‌‌కి కూడా యువరాజ్ సింగ్ రిటైర్మెంట్‌ని తెలిపాడు. తర్వాత గ్లోబల్ టీ20 కెనడా, అబుదాబి టీ10 లాంటి విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో కూడా ఆడాడు. యువరాజ్ సింగ్ మళ్లీ దేశవాళీలో పంజాబ్ తరఫున ఆడాలని పట్టుబట్టిన పంజాబ్ క్రికెట్ సంఘం కార్యదర్శి పునీత్ బాలి యువీ తన రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకునేలా ఒప్పించాడు. యువరాజ్ సింగ్ కోసం ఒకవేళ బీసీసీఐ నియమాలను మారిస్తే యూవీకి మరలా దేశవాళీ, ఐపీఎల్‌లో ఆడేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది

ఐపీఎల్ 2020 జరుగుతున్న టైంలో యువరాజ్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు పేపర్కున్నాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒకసారి భారత క్రికెటర్ విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో ఆడితే మళ్లీ బీసీసీఐ నేతృత్వంలో జరిగే ఏ టోర్నీలో ఆడేందుకు పెర్మిషన్ లేదు. మొహాలిలోని స్టేడియంలో కొద్దిరోజులుగా పంజాబ్ టీమ్‌తో కలిసి యువరాజ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముస్తాక్ అలీ టీ20 కోసం ప్రకటించిన 30 మంది ఆటగాళ్ల జాబితాలో పంజాబ్ యూవీకి స్థానం కల్పించింది. అతను పంజాబ్ తరఫున బరిలోకి దిగడం నిర్ణయించగా బీసీసీఐ నుంచి ఇంకా అనుమతి రాలేదు. యువీ తరహానే రిటైర్మెంట్ ప్రకటించి విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో ఆడిన ప్రవీణ్ తంబేని ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో రూ. 20 లక్షలకి కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ.. టోర్నీలో ఆడేందుకు బీసీసీఐ అతడ్ని అనుమతించలేదు. విదేశీ లీగ్స్‌లో ఆడినందున బీసీసీఐ పరిధిలో జరిగే ఐపీఎల్‌లో ఆడేందుకు అతను అనర్హుడంటూ ప్రకటనని విడుదల చేసింది. మరి యువీ విషయంలో బీసీసీఐ ఏ నిర్ణయం తెలియాల్సి ఉంది.

Tags :
|

Advertisement