Advertisement

  • తెలంగాణాలో భారీ వర్షాలపై స్పందించిన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్

తెలంగాణాలో భారీ వర్షాలపై స్పందించిన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్

By: Sankar Thu, 15 Oct 2020 4:56 PM

తెలంగాణాలో భారీ వర్షాలపై స్పందించిన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్


తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. భారీ వర్షాలు, వరదలతో అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా అయ్యాయి. అయితే ఈ భారీ వర్షాలతో తీవ్ర పంట నష్టం జరిగింది.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాతబస్తీలో భారీ వర్షాలకు ఇల్లు కూలి 9మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా..ఒక్క జిహెచ్ఎంసీ లోనే 29 మంది మృతి చెందారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.

త్వరలో పరిస్థితులు మెరుగు పడుతాయని ఆకాంక్షించారు. తెలంగాణాలో భారీ వర్షాలు తగ్గాలని..మామూలు పరిస్థితులు రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు యువీ పేర్కొన్నాడు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ బాగా పని చేస్తున్నారు..ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు యువీ తెలిపాడు.

Tags :
|

Advertisement