Advertisement

  • స్టువర్ట్ బ్రాడ్ అంటే ఆ ఆరు సిక్సర్లు కాదు ..అతడొక లెజెండ్ ..యువరాజ్ సింగ్

స్టువర్ట్ బ్రాడ్ అంటే ఆ ఆరు సిక్సర్లు కాదు ..అతడొక లెజెండ్ ..యువరాజ్ సింగ్

By: Sankar Thu, 30 July 2020 1:09 PM

స్టువర్ట్ బ్రాడ్ అంటే ఆ ఆరు సిక్సర్లు కాదు ..అతడొక లెజెండ్ ..యువరాజ్ సింగ్



టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని దాటిన ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అభినందనలు తెలిపాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో (2007 టి20 వరల్డ్‌కప్‌లో) తన చేతిలో చావు దెబ్బ తిన్న బ్రాడ్‌లా గుర్తుంచుకోకుండా... కనీసం ఇప్పుడైనా ఒక బౌలర్‌గా అతని ఘనతను గుర్తించాలని ఈ సందర్భంగా యువీ తన అభిమానులను కోరాడు. ‘నేను స్టువర్ట్‌ బ్రాడ్‌ గురించి ఎప్పుడు ఏది రాసినా జనం ఆ ఆరు సిక్సర్లనే గుర్తు చేసుకుంటారని నాకు బాగా తెలుసు.

అయితే ఇప్పుడు దాని ప్రస్తావన లేకుండా అతను సాధించిన ఘనతను అభినందించాలని నా అభిమానులను కోరుతున్నా. 500 టెస్టు వికెట్లు అంటే చిన్న విషయం కాదు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, అంకితభావం, పట్టుదల దీని వెనక దాగి ఉంటాయి. వెనకబడిన ప్రతీసారి పోరాటపటిమ కనపర్చి నువ్వు మళ్లీ దూసుకొచ్చావు మిత్రమా...నువ్వో దిగ్గజానికి బ్రాడ్‌... నీకు నా అభినందనలు’ అని యువరాజ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

అయితే ఇంగ్లాండ్ తరుపున టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించిన బ్రాడ్ మీద అన్ని వైపులా నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి ..ముఖ్యంగా కెరీర్ ఆరంభంలోనే యువరాజ్ సింగ్ బ్యాటింగ్ దాటికి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు ఇచ్చి కూడా తిరిగి లేచిన వైనాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు..ఇక అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరాడు. 2016 తర్వాత తొలిసారిగా ఐసీసీ ర్యాంకుల్లో మూడో స్థానానికి చేరిన బ్రాడ్‌... ఆల్‌రౌండర్ల కేటగిరీలో 11వ ర్యాంకును అందుకున్నాడు.

Tags :
|

Advertisement