Advertisement

  • పీవీ సింధుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన యువరాజ్‌, రైనా

పీవీ సింధుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన యువరాజ్‌, రైనా

By: chandrasekar Mon, 06 July 2020 10:45 AM

పీవీ సింధుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన యువరాజ్‌, రైనా


భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా భారత్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సింధు ఈ రోజు తన 25వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తాయి.

‘హ్యాపీ బర్త్‌డే పీవీ సింధు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. దేశానికి మరిన్ని పురస్కారాలు తీసుకురావాలి.’ అంటూ యువరాజ్‌ ట్వీట్‌ చేశాడు.

‘సింధు హ్యాపీ బర్త్‌డే. ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు కృతజ్ఞతలు, మీరు దేశానికే గర్వకారణం. స్ఫూర్తిని చాటండి. ఇంకా మెరుగవుతూనే ఉండండి.’ అని రైనా ట్విట్టర్‌ వేదికగా వ్యాఖ్యానించాడు.

ఇంకా ఆమెకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, మాజీ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, ప్రస్తుత క్రీడాకారులు ఎన్. సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప, ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ లేన్ ఉన్నారు.

పీవీ సింధు బాసెల్‌లో జరిగిన 2019 బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టోర్నమెంట్ ఫైనల్లో జపాన్‌కు చెందిన నోజోమి ఒకుహారాను 21-7, 21-7 తేడాతో ఓడించి, బంగారు పతకం సాధించింది. అలాగే, ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలు పీవీ సింధునే.

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు మరో నాలుగు పతకాలు కూడా కైవసం చేసుకుంది. 2013, 2014లో కాంస్యం సాధించగా, 2017, 2018లో రజత పతకాలు సాధించింది. 2016 రియో ​​ఒలింపిక్స్‌లో రజత పతకంతో సత్తాచూపింది.

Tags :
|
|

Advertisement