Advertisement

  • అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి పర్యాటకుడిగా రికార్డు ఎక్కనున్న యుసాకు

అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి పర్యాటకుడిగా రికార్డు ఎక్కనున్న యుసాకు

By: chandrasekar Thu, 27 Aug 2020 11:30 AM

అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి పర్యాటకుడిగా రికార్డు ఎక్కనున్న యుసాకు


ఎలాన్ మ‌స్క్‌కు చెందిన‌ ప్ర‌ముఖ అంత‌రిక్ష సంస్థ‌ స్పేస్ ఎక్స్ సంస్థ చంద్రుని పైకి ప‌ర్యాట‌కుల‌ను పంపేందుకు స‌ర్వం సిద్ధం చేస్తున్న‌ది. ఈ మేర‌కు భారీ అంత‌రిక్ష వాహ‌క‌ నౌక బీఎఫ్ఆర్‌ను అభివృద్ధి చేసింది. జపాన్‌లోని అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ రిటైల్‌ వెబ్‌సైట్‌ జోజోటైన్‌కు అధినేత అయిన యుసాకు మెజావా స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంత‌రిక్షంలోకి వెళ్లే అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఈ యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన మొద‌టి ప‌ర్యాట‌కుడిగా యుసాకు రికార్డు పుట‌ల్లోకి ఎక్క‌నున్నారు. చంద్రుడిపై ఇప్పటివరకు సుమారు 24 మంది మానవులు అడుగుపెట్టారు. అయితే, వారంతా పరిశోధనల్లో భాగంగా అక్కడికి వెళ్లిన వ్యోమగాములే త‌ప్ప సాధార‌ణ ప‌ర్యాట‌కులు కాదు.

కానీ, తొలిసారి ఓ సాధార‌ణ‌ వ్యక్తి చంద్రుని పైకి పర్యాటకుడిగా వెళ్ల‌నున్నాడు. 2023 జ‌న‌వ‌రిలో ఈ యాత్ర జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ ప్రయాణంలో తోడుగా యుసాకు తన కంపెనీలోని మరో ఎనిమిది మందిని తీసుకెళ్లనున్నారు. ఆరు రోజుల‌పాటు వీరి అంత‌రిక్ష‌యానం ఉంటుంది. చంద్ర‌మండ‌లంలో 125 మైళ్లు వీరి ప్ర‌యాణం సాగ‌తుంది. కాగా, ఈ యాత్ర‌లో త‌న జీవిత భాగ‌స్వామిగా అంత‌రిక్షంలోకి రావ‌డం కోసం ఒక గ‌ర్ల్ ఫ్రెండ్ కావాల‌ని యుసాకు మెజావా గ‌తంలో ఒక ప్ర‌క‌ట‌న కూడా చేశారు. అప్ప‌టి త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్, న‌టి అయామి గోరికి త‌న నుంచి విడిపోవ‌డంతో యుసాకు ఆ ప్ర‌క‌ట‌న చేశారు. జాబిల్లి యాత్ర అనుభవాన్ని ఒక విశిష్ట‌ మహిళతో పంచుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Tags :
|

Advertisement