Advertisement

  • సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్సార్ బడుగు వికాసం

సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్సార్ బడుగు వికాసం

By: chandrasekar Tue, 27 Oct 2020 03:08 AM

సీఎం జగన్ ప్రారంభించిన వైఎస్సార్ బడుగు వికాసం


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వైఎస్సార్ బడుగు వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ప్రజలు వివిధ సంస్థల్లో పని చేయడమే కాదు. ఇక వారు సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే రోజులు రానున్నాయి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వారిని ప్రోత్సాహించడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం అని. అందులో ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టిలకు 6 శాతం కేటాయింపులు కూడా చేస్తున్నాం అని తెలిపారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అధికారులను ఆదేశించినట్టు జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020-23 సంవత్సరాలకు గాను ఎస్సీ, ఎస్టీ వర్గ ప్రజలకు పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది.

అందులో భాగంగానే జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ దసరా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించింది అని ఎస్సీ, ఎస్టీ ప్రజలకు చేయూతగా ఉంటుంది అని తెలిపారు .ఈ కార్యక్రమంలో భాగంగా కోటి రూపాయల ప్రోత్సాహకాలతో పాటు స్కిల్ డెవలెప్మెంట్ అవకాశాలు కల్పించడం చేస్తామన్నారు. స్టాంప్ డ్యూటీ, ఇంట్రెస్ట్ రీబేట్, డిస్కౌంట్, ఎస్జీఎస్టీ, క్వాలిటీ సర్టిఫికేషన్, పెటెంట్స్ పై డిస్కౌంట్స్ ఉంటాయి అని తెలిపారు.

Tags :
|
|

Advertisement