Advertisement

  • అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌ నాలుగో స్థానంలో

అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌ నాలుగో స్థానంలో

By: chandrasekar Thu, 04 June 2020 6:49 PM

అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌ నాలుగో స్థానంలో


సీఓటర్‌ – ఐఏఎన్‌ఎస్‌ చేపట్టిన సర్వేలో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌ టాప్ ర్యాంకుల్లో నిలిచారు. ఈ జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ మొదటి స్థానంలో నిలవగా ఆయన పాలనపై 82.96 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్‌ భగేల్‌ రెండో స్థానం దక్కగా ఆయన పాలనపై 81.06 శాతం మంది ప్రజలు బావుందన్నారు. ఇక కేరళ సీఎం పినరయి విజయన్ మూడో స్థానంలో నిలువగా పినరయ్‌ పాలనపై కేరళలో 80.28 శాతం సంతృప్తి వ్యక్తమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో ప్లేస్‌లో ఉండగా జగన్ పాలనపై మొత్తం 78.01 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం 16వ స్థానంలో నిలిచారు తెలంగాణలో 54.26 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదో స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నిలిచారు. ఆయన పాలనకు 72.56 శాతం మంది ప్రజల మద్దతు ఇచ్చారు.

ప్రధాని మోదీ పనితీరుపై దేశవ్యాప్తంగా 58.36 శాతం మంది ప్రజలు అత్యంత సంతృప్తి వ్యక్తం చేయగా 24.04 శాతం సంతృప్తి 16.71 శాతం సంతృప్తి చెందలేదని సర్వేలో తేలింది. కేంద్రంపై రాష్ట్రాల వారీగా ప్రజల సంతృప్తిపైనా సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్(78.65), తెలంగాణ(68.96), కర్ణాటక(67.94), హిమాచల్ ప్రదేశ్(97.46), ఒడిశా(95.73), ఛత్తీస్‌గఢ్(91.42), జార్ఖండ్(76.84), గుజరాత్(75.4), అసోం(73), నార్త్ ఈస్ట్(72.75) రాష్ట్రాలు ఎక్కువగా సంతృప్తిని వ్యక్తం చేశాయి.

Tags :
|
|

Advertisement