Advertisement

  • రామ్ విలాస్ పాశ్వాన్ మృతికి సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

రామ్ విలాస్ పాశ్వాన్ మృతికి సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

By: Sankar Fri, 09 Oct 2020 06:44 AM

రామ్ విలాస్ పాశ్వాన్ మృతికి సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు


కేంద్ర మంత్రి రామ్‌ విలాస్ పాశ్వాన్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంతో ఉన్న దళిత నాయకుడు, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌ఎస్‌పి) చీఫ్ అణగారిన వర్గాలవారిపట్ల గొంతుకగా నిలిచారన్నారు. ఆయన మృతి దేశ రాజకీయాలలో తీరని లోటుగా మిగిలిపోనుందన్నారు.ఈ సందర్భంగా పాశ్వాన్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాడ సానుభూతి ప్రకటించారు..

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మృతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ అండగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాజకీయ నాయకుడిగా సామాజిక ఉద్యమ కారుడిగా పాశ్వాన్ కు భారత రాజకీయ చరిత్రలో గొప్ప స్థానం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పాశ్వాన్ మృతి పట్ల పార్టీ కార్యకర్తలకు, ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాగా ఇటీవల అనారోగ్యం పాలైన ఆయనకు ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తన తండ్రి చనిపోయినట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. పాశ్వాన్‌ హఠాణ్మరణంపై పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్‌జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు

Tags :
|
|

Advertisement