Advertisement

  • వైఎస్ కీలక నిర్ణయం...జర్నలిస్టులు కుటుంబాలకు అండ

వైఎస్ కీలక నిర్ణయం...జర్నలిస్టులు కుటుంబాలకు అండ

By: chandrasekar Tue, 13 Oct 2020 5:44 PM

వైఎస్ కీలక నిర్ణయం...జర్నలిస్టులు కుటుంబాలకు అండ


ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్‌గా నిలబడిన వారిలో కీలకంగా వ్యవహరించిన జర్నలిస్టులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వైరస్‌పై ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. కరోనాతో చనిపోయిన ప్రతి జర్నలిస్ట్‌కు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని.. ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి తెలిపారు. కరోనా సమయంలో కూడా జర్నలిస్టులు వార్తా సేకరణలో ముందుండి నడిచారన్నారు శ్రీనివాస్ రెడ్డి. ప్రధాని కూడా జర్నలిస్ట్‌లు కరోనా వారియర్స్ అని చెప్పారని వారికి ప్రభుత్వాలు నుంచి సహకారం ఇవ్వాలి అన్నారు.

ఏపీలో 38 మంది జర్నలిస్టులు చనిపోగా వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు 5 లక్షలు ఇస్తానని సీఎం హామీ ఇచ్చారని చికిత్స తీసుకునే వారికి కూడా ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సీఎంకు, తమకు సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కారణంగా చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం జగన్‌ ముందుకు రావడం మంచి పరిణామం అన్నారు జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన చాలా సానుకూలంగా స్పందించారన్నారు.

Tags :

Advertisement