Advertisement

  • యువతను పెడదోవపట్టించే వెబ్‌సైట్లు రద్దు?...జగన్ సంచలన నిర్ణయం...!

యువతను పెడదోవపట్టించే వెబ్‌సైట్లు రద్దు?...జగన్ సంచలన నిర్ణయం...!

By: chandrasekar Thu, 29 Oct 2020 2:26 PM

యువతను పెడదోవపట్టించే వెబ్‌సైట్లు రద్దు?...జగన్ సంచలన నిర్ణయం...!


ఆంధ్రప్రదేశ్‌లో యువతను చెడు త్రోవలో తీసుకెళ్లే వెబ్‌సైట్లను రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్, సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు సీఎం జగన్‌ లేఖ రాశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను నిషేధించాలని కోరారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్‌ సైట్లు ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌కు కారణమవుతున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏపీలో ఈ 132 వెబ్‌సైట్లను నిషేధించాలని కేంద్ర మంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

ఈ బెట్టింగ్‌, గాంబ్లింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లకు యువత బానిసవుతున్నారని తెలిపారు. వీటి కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నారని సీఎం లేఖలో తెలియచేసారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1974 ఏపీ గేమింగ్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఆ చట్టం ద్వారా నిందితులను కఠినంగా శిక్షించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలని కోరారు.

Tags :
|

Advertisement