Advertisement

  • ఆగస్టు మరియు సెప్టెంబర్‌ నెలల్లో 44 శాతం గా పెరిగిన యువకుల అప్పులు

ఆగస్టు మరియు సెప్టెంబర్‌ నెలల్లో 44 శాతం గా పెరిగిన యువకుల అప్పులు

By: chandrasekar Fri, 11 Dec 2020 5:43 PM

ఆగస్టు మరియు సెప్టెంబర్‌ నెలల్లో 44 శాతం గా పెరిగిన యువకుల అప్పులు


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. మన దేశంలో లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి వివిధ రంగంలో ఎక్కువ మంది ఉపాధిని కోల్పోయారని తెలిసింది. అయితే ఇప్పుడిప్పుడే భారత ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయని, జీడీపీ అంచనాలూ క్రమంగా మెరుగుపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ నేపథ్యంలో తలకిందులైన ఆర్థిక పరిస్థితులు వల్ల మిల్లేనియల్స్‌ (వయసు 22 సంవత్సరాలనుండి 38 వరకు) వున్న వారిని అప్పుల వైపు నడిపించాయి. దేశంలో దాదాపు సగం మిల్లేనియల్స్‌ 1981 తర్వాత జన్మించినవారు.

కరోనా వైరస్ కట్టడికోసం లాక్ డౌన్ చేయబడ్డ ఆగస్టు మరియు సెప్టెంబర్‌లో అధికంగా అప్పులు చేసినట్లు బ్రిటన్‌కు చెందిన స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ సర్వేలో తెలియజేసింది. ఇతర వయస్కులతో పోల్చితే రోజువారీ అవసరాలను తీర్చుకోవడం కోసం మిల్లేనియల్స్‌ ఎక్కువగా ఇబ్బంది పడిపోయారని పేర్కొంది. దీనివల్ల వీరు రుణాలపై ఆధారపడాల్సి వచ్చిందని తెలియజేసింది. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 1 మధ్య భారత్ ‌సహా 12 దేశాల్లో 12వేల మంది అభిప్రాయాల ఆధారంగా స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ ఈ సర్వేను నిర్వహించింది.

ఈ సందర్భంగా మిల్లేనియల్స్‌ అప్పులు ఈ రెండు నెలల్లో 44 శాతం గా పెరిగాయని రుజువైంది. అయితే 45కుపైగా వయసున్నవారి రుణభారం మాత్రం 28 శాతమే పెరిగినట్లు తెలియజేసింది. కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ తెలిపింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి సంఘటిత రంగంలో ఎక్కువ మంది ఉపాధిని కోల్పోయారని చెప్పింది. అన్ లాక్ తరువాత ఇప్పుడిప్పుడే భారత ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయని, జీడీపీ అంచనాలూ క్రమంగా మెరుగవుతున్నాయని తెలిపింది.

భారత్‌లో 48 శాతం మిల్లేనియల్స్‌ కొత్త కారు లేదా ఇల్లు కొనుగోలు కోసం పొదుపు చేస్తున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. 45 ఏండ్లకు పైబడినవారిలోనూ 28 శాతం మంది ఇదే లక్ష్యాల సాధనతో పయనిస్తున్నారు. ప్రస్తుతం మిల్లేనియల్స్‌లో 39 శాతం మంది పెట్టుబడులపై ఆసక్తి కనపరుస్తుండగా, 45 ఏండ్లు దాటినవారిలో 26 శాతం మందే పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఈ ఆర్థిక లోటు పుంజుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.

Tags :
|

Advertisement