Advertisement

  • యువతులు ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసిన యువకులు

యువతులు ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసిన యువకులు

By: chandrasekar Sat, 01 Aug 2020 6:03 PM

యువతులు ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసిన యువకులు


ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు నీచానికి పాల్పడ్డారు. తమతోపాటు చదువుకున్న యువతులు, లెక్చరర్ల ఫోటోలను పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశారు. తమ ఫోటోలను ఆ చెత్త సైట్లలో చూసి షాకైన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

సీవీ రామన్‌నగర్‌కు చెందిన అజయ్ థనికాచలం, రాజయ్యనగర్‌కు చెందిన విశ్వక్‌సేన్ స్నేహితులు. విశ్వక్‌సేన్ తనతో చదువుకున్న అమ్మాయిలు, లేడీ లెక్చరర్ల ఫోటోలను సోషల్‌మీడియా నుంచి డౌన్‌లోడ్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన అజయ్‌కి ఇచ్చాడు. అతడు వాటిని మార్ఫింగ్ చేసి పోర్న్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేశాడు. అశ్లీల వెబ్‌సైట్లలో తమ ఫోటోలు ఉన్నట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేసారు.

ఈ ఘటన ఫై రంగంలోకి దిగిన బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు సుమారు 30 మంది ఫోటోలను అప్‌లోడ్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ ఫోటోలను వెంటనే తొలగించాలంటూ ఆయా వెబ్‌సైట్లకు మెయిల్ చేశారు.

Tags :
|
|
|

Advertisement