Advertisement

  • అప్పు చెల్లించలేదు అని ఫోన్ లో కాంటాక్ట్స్ కు మెసేజ్ పంపిన సంస్థ ..అవమానంతో ఉద్యోగిని మృతి

అప్పు చెల్లించలేదు అని ఫోన్ లో కాంటాక్ట్స్ కు మెసేజ్ పంపిన సంస్థ ..అవమానంతో ఉద్యోగిని మృతి

By: Sankar Thu, 17 Dec 2020 10:39 AM

అప్పు చెల్లించలేదు అని ఫోన్ లో కాంటాక్ట్స్ కు మెసేజ్ పంపిన సంస్థ ..అవమానంతో ఉద్యోగిని మృతి


టెక్నాలజీ పెరగడంతో ఇప్పుడు అంత చేతిలోని సెల్ ఫోన్ లోనే నడుస్తుంది ..ఇంతకుముందు అప్పు కావాలంటే ఊరులో తెలిసిన వాళ్ళ డాగర తీసుకొనేవారు ..వారు అయితే కొద్దీ రోజులు లేట్ అయినా కూడా పెద్దగా ఏమి అనేవారు కాదు..అయితే ఇపుడు పెరిగిన టెక్నాలజీ తో అప్పులు కూడా ఆన్లైన్ లోనే యాప్స్ ద్వారా దొరుకున్తున్నాయి..

ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేకుండానే సులభ పద్దతిలో అప్పులు లభిస్తుండటంతో చాల మంది ఆన్లైన్ యాప్స్ ద్వార అప్పులు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు ..అయితే అప్పు ఇచ్చే సంస్థలు అప్పు ఇచ్చేప్పుడు అప్పు తీసుకునే వారి యొక్క కాంటాక్ట్స్ కూడా తీసుకుంటుంది...ఇప్పుడు అదే ఒక అధికారిని ప్రాణం తీయడానికి కారణం అయింది...

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకి చెందిన మౌనిక(24) ఏఈవోగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం కొన్నేళ్లుగా సిద్దిపేటలో నివాసముంటోంది.వ్యాపారంలో తండ్రి నష్టపోవడంతో కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేందుకు మౌనిక ఆన్‌లైన్ యాప్ స్నాప్‌ఇట్ లోన్ నుంచి రూ.3 లక్షలు రుణం తీసుకున్నారు. అయితే గడువులోగా అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో రుణ సంస్థ ఆమెను డిఫాల్టర్‌గా ప్రకటించింది.

అంతటితో ఆగకుండా ఆమె ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్‌లోని అందరికీ ఆమె డిఫాల్టర్ అంటూ వాట్సాప్ మెసేజ్‌లు పెట్టింది. దీంతో అవమానంగా ఫీలైన ఏఈవో మౌనిక ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :
|

Advertisement