Advertisement

  • యంగ్ టైగర్ ఫాన్స్ కు ఆర్ఆర్ఆర్ టీం దసరాకు సర్ప్రైజ్ ఇవ్వనుందా !

యంగ్ టైగర్ ఫాన్స్ కు ఆర్ఆర్ఆర్ టీం దసరాకు సర్ప్రైజ్ ఇవ్వనుందా !

By: Sankar Sun, 04 Oct 2020 9:59 PM

యంగ్ టైగర్ ఫాన్స్ కు ఆర్ఆర్ఆర్ టీం దసరాకు సర్ప్రైజ్ ఇవ్వనుందా !


యావత్ సినీ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'.. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' లాంటి సినిమా తర్వాత రెండేళ్ల విరామం తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్న సినిమా ఇది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటం తో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. టైటిల్ లోగో మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి చరణ్ పుట్టినరోజు కానుకగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు. దీంతో ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజుకు రావాల్సిన వీడియో కరోరా కారణంగా నిలిచి పోయింది. అప్పటి నుండి కూడా ఎన్టీఆర్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు అయిదు నెలలుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఎదురు చూసేలా చేసిన దర్శకుడు రాజమౌళి ఈ నెలలో వారి కోరికను తీర్చబోతున్నాడు. దసరా కానుకగా ఎన్టీఆర్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అభిమానులు పండగ చేసుకునే రేంజ్ లో ఈ వీడియో ఉండబోతుందట.

Tags :
|
|

Advertisement