Advertisement

  • తెలంగాణాలో యువతుల కంటే యువకులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు

తెలంగాణాలో యువతుల కంటే యువకులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు

By: Sankar Sun, 30 Aug 2020 11:46 AM

తెలంగాణాలో యువతుల కంటే యువకులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు


తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది..యువత కూడా కరోనా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు..అయితే రాష్ట్రంలో కరోనా కేసుల్లో యువతుల కంటే ఎక్కువగా యువకులే ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది..తాజాగా వైరస్‌ బారినపడిన బాధితులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ.. వయసు, స్త్రీ, పురుషుల వారీగా విభజించి నివేదిక తయారు చేసింది. దాని ప్రకారం ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ప్రధానంగా 21 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు 47.06 శాతం కరోనా బారినపడ్డారు. ఇతర అన్ని వయసుల వారితో పోలిస్తే వీరే అధికంగా ఉండటం గమనార్హం. ఆ తర్వాత 41–50 ఏళ్ల మధ్య వయసు వారు 18.24 శాతం మంది ఉన్నారు. 51–60 ఏళ్ల వయసువారు 14.38 శాతం ఉన్నారు.

రాష్ట్రంలో శుక్రవారం నాటికి మొత్తం 1,20,166 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు 47.06 శాతం ఉండగా, యువకులు 31.49 శాతం, యువతులు 15.57 శాతం ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం యువతుల కంటే యువకుల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

ఇక 21–30 ఏళ్ల వయసుగలవారిలో యువకులు 14.52 శాతం కరోనా బారిన పడగా, యువతులు కేవలం 8.07 శాతం ఉన్నారు. అలాగే 31–40 ఏళ్ల వయసులో యువకులు 16.97 శాతం, యువతులు 7.50 శాతం ఉన్నారని నివేదిక వెల్లడించింది. యువతులు ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలను పాటిస్తుండటం వల్ల వారిలో కరోనా తక్కువగా వ్యాపిస్తోందని అంటున్నారు. తప్పనిసరిగా మాస్క్‌లు, స్కార్ఫ్‌లు ధరించడంతోపాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవడం వల్ల యువతుల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని చెబుతున్నారు.

Tags :

Advertisement