Advertisement

  • కరోనా నుంచి అక్క కోలుకొని ఇంటికి రావడంతో ..వీధిలో డాన్స్ లతో స్వాగతం పలికిన చెల్లెలు ..

కరోనా నుంచి అక్క కోలుకొని ఇంటికి రావడంతో ..వీధిలో డాన్స్ లతో స్వాగతం పలికిన చెల్లెలు ..

By: Sankar Mon, 20 July 2020 3:44 PM

కరోనా నుంచి అక్క కోలుకొని ఇంటికి రావడంతో ..వీధిలో డాన్స్ లతో  స్వాగతం పలికిన చెల్లెలు ..



కరోనా సోకింది అనగానే వెంటనే మనసులో ఎదో తెలియని భయం ..అదే కరోనా నుంచి కోలుకొని ఇంటికి వస్తే ఆ ఇంట్లో కుటుంబ సబ్యులకు ఉండే ఆనందం అంతా ఇంతా కాదు ..సరిగ్గా ఇలాంటి సంఘటనే పూణే లో జరిగింది ..తన అక్క కరోనా నుంచి కోలుకొని ఇంటికి రావడంతో ఆనందం పట్టలేని చెల్లెలు వీధిలో డాన్స్ చేస్తూ తన అక్క కి ఘన స్వాగతం పలికింది.. ప్రస్తుతం వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌అయ్యింది.

పూణేలో సలోని సాట్పుట్ అనే 23 ఏళ్ల యువతి, ఆమె సోదరి స్నేహాల్‌ కరోనాను జయించి ఇంటికి వస్తున్నప్పుడు నృత్యం చేస్తూ స్వాగతం పలికింది. ఈ వీడియోను దీపాన్షు కబ్రా అనే ఐపీఎస్‌ అధికారి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. “సోదరీమణుల ఆనందం నాకు నచ్చింది. కరోనాను ఓడించిన తన సోదరికి స్వాగతం పలుకుతూ ఆమె ఆనందంగా వేసే చిందులు ఆకట్టుకున్నాయి.’’ అని ఆయన రాసుకొచ్చాడు.

ఇంటికి వచ్చే వీధిలోకి స్నేహాల్‌ ప్రవేశించిన వెంటనే..సలోని ‘చిల్లర్ పార్టీ’ చిత్రం నుంచి ‘తాయ్ తాయ్ ఫిష్’ అనే ప్రాచుర్యం చెందిన పాటను పెట్టి నృత్యం ప్రారంభిస్తుంది. స్నేహాల్‌ ఇంటికి చేరుకోగానే ఆమె కూడా సలోనితో కలిసి చిందేస్తుంది. ఆ తర్వాత వారి తల్లి ఆమెను హారతిచ్చి ఇంటి లోపలికి స్వాగతించింది.

Tags :
|
|

Advertisement