Advertisement

  • ఫోన్ వాడొద్దు అన్నందుకు ఆత్మహత్య చేసుకున్న బాలిక

ఫోన్ వాడొద్దు అన్నందుకు ఆత్మహత్య చేసుకున్న బాలిక

By: Sankar Sun, 02 Aug 2020 1:41 PM

ఫోన్ వాడొద్దు అన్నందుకు ఆత్మహత్య చేసుకున్న బాలిక



ప్రస్తుత మోడ్రన్ యుగంలో మొబైల్ ఫోన్ మన జీవితాల్లో ఓ భాగమైపోయింది. యువతరానికైతే ఇది లేకపోతే పొద్దే గడవటంలేదు. ఇటీవలి కాలంలో పిల్లలు ముఖ్యంగా యువత ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బానిసలుగా మారి అర్థ రాత్రివరకూ మొబైల్ ఫోన్లను ఉపయోగించడం అధికమైందని తల్లి తండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, చిరాకు, అసహనం అధికం కావడం, శారీరక శ్రమకు దూరం కావడంతో పలు రకాల సమస్యలను ఎదురుకొంటున్నారు..మొబైల్ అనేది ఓ వ్యసనంలా మారింది. ఎంతలా అంటే ఇది లేకపోతే ప్రాణం తీసుకునేంతలా.

తాజాగా హైదరాబాద్‌లో రాచకొండకమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటనే దీనికి ఉదాహరణ. నగరానికి చెందిన ఓ 15ఏళ్ల బాలిక ఎప్పుడూ చేతిలో మొబైల్ పట్టుకొని, ఏవో వీడియోలు చూస్తూ ఉంటోంది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఈ వ్యసనం నుంచి కుమార్తెను దూరం చేయాలనుకున్నారు. అంతే, ఆమె ఫోన్ వాళ్లు తీసేసుకున్నారు.

ఆ తర్వాత ఆఫీసుకు వెళ్లారు. వారు ఇంటికి తిరిగొచ్చే సరికే ఆ బాలిక ఉరేసుకొని కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement