Advertisement

  • రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ శక్తి'ని ప్రారంభించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ శక్తి'ని ప్రారంభించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

By: chandrasekar Mon, 19 Oct 2020 10:09 AM

రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ శక్తి'ని ప్రారంభించిన సీఎం యోగి ఆదిత్యనాథ్


రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ శక్తి'ని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. మిషన్‌ శక్తి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 'మిషన్ శక్తి'ని ప్రారంభించిందని, ఈ పథకం ప్రచారంలో ప్రభుత్వంలోని వివిధ విభాగాలు పాల్గొంటున్నాయని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ చెప్పారు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రతతో పాటు వారి సాధికారత కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు, వాలంటీర్లు, స్వయం సహాయక బృందాలు మిషన్ శక్తితో కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. మహిళలను గౌరవంగా చూసే ఒక రాష్ట్రాన్ని తాను ఊహించానని, మహిళల కష్టాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచాలని ఈ కార్యక్రమం భావిస్తున్నట్లు చెప్పారు. మహిళల సాధికారత, భద్రతను నిరోధించే సవాళ్లను ఎదుర్కోవటానికి మిషన్ మొదటి దశ ఉద్దేశించిందని ఆయన అన్నారు. మిషన్‌కు తమ మద్దతును తెలుపుతూ ప్రతిజ్ఞ చేసిన మహిళా సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక బృందాలకు సీఎం ఆదిత్యనాథ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో శరదృతువు సీజన్లో హిందువులు జరుపుకునే నవరాత్రి పండుగ ప్రారంభానికి గుర్తుగా ఈ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ట్విట్టర్‌లో సీఎం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,535 పోలీస్ స్టేషన్లలో మహిళా ఫిర్యాదుదారుల కోసం ఇప్పుడు ఒక ప్రత్యేక గది ఉంటుందని, అక్కడ ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్ హాజరై వారి ఫిర్యాదుపై అత్యవసర చర్యలు తీసుకుంటారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి వేగంగా శిక్ష పడేలా చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ఆదిత్యనాథ్‌ చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఒక ఘోర సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

Tags :

Advertisement