Advertisement

  • అసలు ఎమ్మెల్యే అవ్వకుండానే ఇన్ని పార్టీలు మారిన నాయకుడ్ని నిన్నే చూశాను: కేఏ పాల్

అసలు ఎమ్మెల్యే అవ్వకుండానే ఇన్ని పార్టీలు మారిన నాయకుడ్ని నిన్నే చూశాను: కేఏ పాల్

By: chandrasekar Mon, 10 Aug 2020 10:44 AM

అసలు ఎమ్మెల్యే అవ్వకుండానే ఇన్ని పార్టీలు మారిన నాయకుడ్ని నిన్నే చూశాను: కేఏ పాల్


కేఏ పాల్ మాట్లాడుతూ... తమ్ముడూ పవన్ కళ్యాణ్ నువ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్‌గా ఉండు నేను డబ్బు తీసుకుని వస్తాను అంటే నా మాట వినలేదు. అసలు ఎమ్మెల్యే అవ్వకుండానే ఇన్ని పార్టీలు మారిన నాయకుడ్ని నిన్నే చూశాను అందుకే ఆ పిచ్చోడు నీ అరాచకకాలపై సినిమా కూడా తీశాడు అంటూ శివాలెత్తారు. పవర్‌లో ఉన్న జగన్‌ని, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని వదిలేసి జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఒక్కసీటు కూడా లేని పవన్ కళ్యాణ్‌కి బుద్ది చెప్పండి ప్రజలారా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘ఈ పవన్ కళ్యాణ్‌కి ఇంకా సిగ్గురాలేదు. వాళ్ల అన్నయ్య అంటే 18 సీట్లు గెలిచారు. పాలకొల్లులో చిత్తుగా ఓడిపోయినా తిరుపతిలో గెలిచారు. ఇలాంటి వారి వల్ల 25 శాతం ఉన్న కాపులకు తీవ్ర నష్టం జరుగుతుంది. 85 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి తీరని నష్టం అని ఆనాడే చెప్పాను. ఆ తరువాత చిరంజీవి కాంగ్రెస్‌లో కలిసిపోయాడు. తమ్ముడా పవన్ కళ్యాణ్!! రా మనం అందరం కలిసి పనిచేద్దాం. లేదంటే నువ్ ఒక్క చోట కూడా గెలవ లేవు అని చెప్పాను. నీకు నీతి నిజాయితీ ఉంటే రమ్మని చెప్పాను. కాని 2014లో బీజేపీ-టీడీపీకి ప్రచారం చేసి కమ్యునల్ పార్టీలని తిట్టి తిరిగి మాయావతి కాళ్లపై పడ్డావు.

అప్పుడు కమ్యునిష్టులని పొగిడి వాళ్లని విడిచిపెట్టేసి 2024లో ముఖ్యమంత్రి అవ్వాలని ఇప్పుడు బీజేపీతో కలుస్తావా? నువ్ ఇలాంటి వాడివనే ఆ పిచ్చోడు నీ మీద సినిమా తీశాడు. వాడి పేరు కూడా చెప్పడం అనవసరం. నిన్ను విమర్శిస్తూ సినిమా తీశాడు. ఎందుకు తమ్ముడూ పవన్ కళ్యాణ్ అందరి చేతా ఛీ అనిపించుకోవడం. అందుకే 25 శాతం ఉన్న కాపులు నీకు 2 శాతం కూడా ఓటు వేయలేదు. నీకు 5-6 పర్శంట్ ఓట్లు వస్తాయని చెప్పాను. మూడు నాలుగు పార్టీలను కలుపుకున్నా నీకు ఓట్లు పడలేదు. ఆ జేడీ లక్ష్మీనారాయణ నీ పార్టీని ఎందుకు వదిలేశాడు. నీకు నీతి నిజాయితీ లేదనే కదా.

నేను ఇలా మాట్లాడకూడదు కాని బాధతో ఆత్మ వేదనతో మాట్లాడాల్సి వస్తుంది. తమ్ముడూ పవన్ కళ్యాణ్.. నువ్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్‌గా ఉండు.. నేను డబ్బు తీసుకుని వస్తాను అని చెప్పాను నా మాట విన్నావా? అంతెందుకు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మాట విన్నావా? నీ జనరల్ సెక్రటరీ మాట విన్నావా? కమలాకర్ గారి మాట విన్నావా?? ఎంతమంది చెప్పినా వినలేదు. నీకు అంత పదవీ దాహం ఎందుకో అర్థం కావడం లేదు. బీజేపీతో ఉన్నంత కాలం నువ్ లైఫ్‌లో ముఖ్యమంత్రి కాలేవు అసలు ఎప్పుడూ అవ్వలేవు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని మార్పు చెందు లేదంటే ఆ డాన్స్‌లు వేసుకుని సినిమాలకు పో.. ఎందుకు రాజకీయాల్లో ఉండి ప్రజలకు అన్యాయం చేయడం ఎమ్మెల్యే అవ్వకముందే ఇన్ని పార్టీలు మారతావా? నువ్ నిజంగా ఎమ్మెల్యే అయ్యి ఉంటే ఇంకెన్ని చేసేవాడివో ప్రజలారా ఇలాంటి వాళ్లకు బుద్ది చెప్పండి’ అంటూ 'కేఏ పాల్' పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

Tags :
|
|

Advertisement