Advertisement

  • తిరుమల కొండను అపవిత్రం చేస్తున్న వైసీపీ కార్యకర్తలు...!

తిరుమల కొండను అపవిత్రం చేస్తున్న వైసీపీ కార్యకర్తలు...!

By: Anji Wed, 23 Dec 2020 1:48 PM

తిరుమల కొండను అపవిత్రం చేస్తున్న  వైసీపీ కార్యకర్తలు...!

పవిత్ర పుణ్య క్షేత్రం అయిన తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారు కొంత మంది రాజకీయ నాయకులు. తాజాగా వైసీపీ కార్యకర్తలు తిరుమలకు సిగరెట్లు తీసుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది.

రాజంపేట వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి కాలినడకన అన్నమయ్య మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. అయితే ఆయన అనుచరులు కొంతమంది కారులో అలిపిరి రోడ్డు మార్గం మీదుగా నిషేధిత వస్తువు అయిన సిగరెట్లతో తిరుమలకు చేరుకున్నారు.

వారి వాహనాలను అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది నామమాత్రంగా తనిఖీలు చేసి వదిలి పెట్టినట్లుగా సమాచారం. ఇక పార్వేటి మండపం సమీపంలో అమర్‌నాథ్ రెడ్డికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ వ్యక్తి నడిరోడ్డుపై సిగరెట్ తాగుతూ కనిపించాడు.

వైసీపీ కార్యకర్తలు పార్వేటి మండలం సమీపంలో సిగరెట్ తాగుతున్నా టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. తిరుమల పరిసరాల్లో గుట్కాలు, పొగాకు వాడకంపై నిషేధం ఉంది. అయినా వైసీపీ నేతలు వెంకన్న క్షేత్రానికి సిగరెట్లు తీసుకురావడంపై భక్తులు మండిపడుతున్నారు.

అమర్‌నాథ్ రెడ్డి కాలినడక యాత్రలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరా వినియోగించడం వివాదాస్పదమైంది. తిరుమలలో భద్రత కారణంగానూ, అలాగే స్థల పవిత్రత దృష్ట్యా కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి.

ఆ నిబంధనలలో ఒకటి డ్రోన్ కెమెరాల వాడకం పై నిషేధం ఉంది. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ నేతలు తమ పాదయాత్ర చిత్రీకరణకు డ్రోన్ కెమెరాను వాడడం తీవ్ర దూమారం రేపింది.

రాజంపేట మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి గత 18 ఏళ్లుగా కడప జిల్లా నుంచి అన్నమయ్య మార్గం ద్వారా కాలిబాటన తిరుమలకు చేరుకుంటున్నారు. ఈసారి కూడా ఆయన అన్నమయ్య కాలిబాట మార్గం ద్వారా వందలాదిమందితో కలిసి కాలినడకన తిరుమల పాపవినాశనం రోడ్డు పార్వేటి మండపం వద్దకు చేరుకున్నారు.

అయితే ఈ పాదయాత్రను చిత్రీకరించేందుకు అమర్నాథ్ రెడ్డి మద్దతుదారులు కొందరు డ్రోన్ కెమెరాను వినియోగించారు. రెండు రోజులుగా తిరుమలపై కొండపై జరుగుతున్న ఘటనలతో టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యం బట్టబయలైంది.

అధికారపార్టీ నాయకులు కావడంతో అటు టీటీడీ విజిలెన్స్ కానీ, ఇటు పోలీసులు కానీ అభ్యంతరం చెప్పలేకపోవడంతోనే ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది.

భద్రత పేరుతో సామాన్యు భక్తులను నానా ఇబ్బందులకు గురిచేసే భద్రతా సిబ్బంది.. అధికారపార్టీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించినా పట్టించుకోకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Advertisement