Advertisement

  • రాష్ట్రానికి రాబడులు పెంచడంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న యనమల

రాష్ట్రానికి రాబడులు పెంచడంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న యనమల

By: chandrasekar Mon, 01 June 2020 10:46 PM

రాష్ట్రానికి రాబడులు పెంచడంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న యనమల


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతగానితనంతోనే రాష్ట్రం దివాలా తీసిందని, టిడిపి 53 శాతం కేపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ పెంచితే వైసిపి 50శాతం కోత పెట్టిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి రాబడులు పెంచడంలో, రెవెన్యూ వ్యయంలో వైసిపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

టిడిపి హయాంలో మొత్తం బడ్జెట్‌ వ్యయం 11.6శాతం పెరిగితే, వైసిపి ఏడాది పాలనలో 1.80 శాతమే పెంచారని తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ముసుగులో వైసిపి కార్యకర్తల జీతాలకు ఏడాదికి రూ.4వేల కోట్ల దుర్వినియోగం చేస్తున్నారని, ఈ మొత్తంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరో 10 శాతం పూర్తయ్యేదని అన్నారు.

సిఎం జగన్‌ పులివెందుల రాజ్యాంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. టిడిపి మంగళగిరి కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా ఆదివారం మీడియాతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని సృష్టించి రాష్ట్రంలోని అన్ని వర్గాలనూ తమ చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని చూస్తోందన్నారు.

Tags :
|
|

Advertisement