Advertisement

లాక్ డౌన్ వలన స్వచ్ఛంగా మారిన యమునా నది

By: Sankar Tue, 26 May 2020 12:51 PM

లాక్ డౌన్ వలన స్వచ్ఛంగా మారిన యమునా నది

కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో పరిశ్రమలు అన్ని మూతపడటంతో ఇండియా లో పొల్యూషన్ స్థాయి ఘననీయంగా తగ్గింది ..పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్ధాలతో ఎప్పుడు పొల్యూషన్తో ఉండే నదులు కూడా ఈ లాక్ డౌన్ కారణంగా మళ్ళీ స్వచంగా తయారుఅవుతున్నాయి ..

దాదాపు రెండు నెలలుగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, పరిశ్రమలు మూతపడటంతో నదులన్ని తిరిగి స్వచ్ఛతను సంతరించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే యమునా నది గతంలో లేనంత స్వచ్ఛంగా మారింది. యమునా నది శుభ్రత కోసం గత 25 ఏళ్లుగా ప్రభుత్వాలు రూ.5000 కోట్లు ఖర్చు పెట్టాయి. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఏళ్లుగా.. కోట్లు ఖర్చు చేసినా రాని ఫలితాన్ని రెండు నెలల లాక్‌డౌన్‌ సాధించింది. కాలుష్యం తగ్గడంతో పక్షులు యమునకు వలస కట్టాయి. చేపల్ని, ఇతర నీటి ప్రాణుల్ని వేటాడుతూ.. ప్రకృతి ధర్మాన్ని నిర్వహిస్తున్నాయి.

Tags :
|
|
|

Advertisement