Advertisement

  • మహిళల కంటే పురుషుల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటానికి గల కారణాలు వెల్లడించిన అమెరికా శాస్త్రవేత్తలు

మహిళల కంటే పురుషుల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటానికి గల కారణాలు వెల్లడించిన అమెరికా శాస్త్రవేత్తలు

By: Sankar Thu, 27 Aug 2020 11:11 AM

మహిళల కంటే పురుషుల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటానికి గల కారణాలు వెల్లడించిన  అమెరికా శాస్త్రవేత్తలు


ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు ..మరణాల రేటు కూడా పురుషుల్లోనే ఎక్కువగా ఉంది..అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అన్న విషయంపై శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి..

కరోనా వైరస్ సోకిన తర్వాత శరీరంలోకి ప్రవేశించే ప్రమాదకారక కణాలను నాశనం చేయడంలో రోగ నిరోధక వ్యవస్థలోని టి-కణాలు కీలకపాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వైరస్ బారినపడిన తర్వాత పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ కణాలు అధికంగా విడుదలవుతున్నట్టు అధ్యయనంలో తేలినట్టు వివరించారు.యేల్ యూనివర్సిటీ మహిళా ఆరోగ్య పరిశోధన విభాగం ఈ అధ్యయనం చేపట్టింది.

ఈ ఫలితాలను నేచర్ పత్రికలో ఆగస్టు 26న ప్రచురించారు. కోవిడ్-19 రోగులలో రోగనిరోధక వ్యవస్థ స్త్రీ పురుషుల మధ్య చాలా భిన్నంగా ఉందని, ఈ తేడా పురుషులలో వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువ సూచించే స్పష్టమైన డేటా ఇప్పుడు మన వద్ద ఉందని పరిశోధనలో పాల్గొన శాస్త్రవేత్త అకికో ఐవాసకీ అన్నారు. ఈ వివరాలు ఆధారంగా మహిళలు, పురుషులు ఇద్దరికీ ప్రభావవంతంగా ఉండే చికిత్స, టీకాలు ఉండేలా వివిధ వ్యూహాలు అవసరమని తెలియజేస్తున్నాయని అన్నారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో కరోనా వైరస్ కారణంగా మరణించే ముప్పు రెండు రెట్లు అధికమని ఇంగ్లాండ్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడయ్యింది.

Tags :
|

Advertisement