Advertisement

  • యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చేభక్తులు ఆధార్ కార్డు తో రావాలి

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చేభక్తులు ఆధార్ కార్డు తో రావాలి

By: chandrasekar Mon, 08 June 2020 3:57 PM

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చేభక్తులు ఆధార్ కార్డు తో రావాలి

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే స్థానికులు, భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ తీసుకొని రావాలని యాదాద్రి ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేపట్నుంచి ఆలయాల్లో భక్తుల దర్శనాలకు అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈవో మీడియా ద్వారా మాట్లాడుతూ భక్తులకు యాదాద్రిలో రేపట్నుంచి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులకు దర్శనానికే అనుమతి తెలిపామన్నారు.

ఎల్లుండి నుంచి భక్తులందరికీ స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయంలో తీర్థప్రసాదాలు, శఠగోపాలు ఉండవన్నారు. ఉచిత, లఘుదర్శనాలకు మాత్రమే అనుమతిస్తామన్నారు.

భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. కాళ్లు, చేతులు శుభ్రం చేసుకున్నాకే ఆలయం లోపలికి రావాలన్నారు. తలనీలాల కల్యాణకట్టను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు గోత్రనామాలతో పూజలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.

Tags :

Advertisement