Advertisement

  • త్వరలో షియోమీ రెడ్ మీ కే30 అల్ట్రా స్మార్ట్ ఫోన్

త్వరలో షియోమీ రెడ్ మీ కే30 అల్ట్రా స్మార్ట్ ఫోన్

By: chandrasekar Wed, 12 Aug 2020 7:39 PM

త్వరలో షియోమీ రెడ్ మీ కే30 అల్ట్రా స్మార్ట్ ఫోన్


చైనా కంపెనీ షియోమీ రెడ్ మీ కే30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను త్వరలో విడుదల కానుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ రెడ్ మీ కే30 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. రెడ్ మీ కే30, రెడ్ మీ కే30 ప్రో, రెడ్ మీ కే30 ప్రో జూమ్ ఎడిషన్ల్ సరసన ఇది కూడా చేరింది. ఇందులో 120 హెర్ట్జ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

రెడ్ మీ కే30 సిరీస్ లో మిగతా ఫోన్లలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్లను ఉపయోగించారు. రెడ్ మీ కే30 ప్రో, రెడ్ మీ కే30 ప్రో జూమ్ ఎడిషన్లలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ను ఉపయోగించడం విశేషం. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో లాంచ్ అయింది. మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ కు గట్టిపోటీ ఇవ్వ నున్నట్లు చెలిపింది.

రెడ్ మీ కే30 అల్ట్రా స్పెసిఫికేషన్లు మరియు ధరలు వివరాలు

* మూన్ లైట్ వైట్, మిడ్ నైట్ బ్లాక్, మింట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఆగస్టు 14వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ చైనాలో ప్రారంభం కానుంది.

* ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉంది.

* 8 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

* మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

* వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లను కూడా అందించారు.

* సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 20 మెగా పిక్సెల్ పాపప్ కెమెరా ఉంది.

* ఈ ఫోన్ లో 4500 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుండటం విశేషం.

* 5జీ, వైఫై 6, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్ సీ వంటి ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి.

* వీటితో పాటు డిస్టెన్స్ సెన్సార్, యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఇన్ ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, హాల్ సెన్సార్లు కూడా ఉన్నాయి. దీని మందం 0.91 సెంటీమీటర్లు కాగా, బరువు 213 గ్రాములుగా ఉంది.

ఈ ఫోన్ లో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

* ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధరను 1,999 యువాన్లుగా (సుమారు రూ.21,500) నిర్ణయించారు.

* 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లుగానూ (సుమారు రూ.23,600)

* 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగానూ (సుమారు రూ.26,800) ఉంది.

* హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,699 యువాన్లుగా (సుమారు రూ.29,000) నిర్ణయించారు.

ఈ ఫోన్ మన దేశంలో విదులైన తరువాత దీని పూర్తి వివరాలు మరియు పెర్ఫార్మన్స్ తెలియనుంది.

Tags :
|
|

Advertisement