Advertisement

  • షియోమీ లాంచ్ చేయబోయే అద్భుతమైన ఉత్పత్తి ఎంఐ 11 స్మార్ట్ ఫోన్...‌

షియోమీ లాంచ్ చేయబోయే అద్భుతమైన ఉత్పత్తి ఎంఐ 11 స్మార్ట్ ఫోన్...‌

By: chandrasekar Thu, 03 Dec 2020 7:27 PM

షియోమీ లాంచ్ చేయబోయే అద్భుతమైన ఉత్పత్తి ఎంఐ 11 స్మార్ట్ ఫోన్...‌


క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ టెక్ సమ్మిట్ 2020లో ఎంఐ 11 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ అధికారికంగా షియోమీ ప్రకటించింది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో వచ్చే మొదటి ఫోన్లలో ఎంఐ 11 సిరీస్ కూడా ఉండనుంది. ఈ విషయాన్ని షియోమీ సహ వ్యవస్థాపకులు, సీఈవో లీ జున్ తెలిపారు. అయితే ఇందులో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6 జీబీ ర్యామ్ ఉండనుందని టాక్. ఈ ఫోన్ జనవరిలో లాంచ్ కానుందని సమాచారం. ఎంఐ 11 గతేడాది లాంచ్ అయిన ఎంఐ 10కు తర్వాతి వెర్షన్‌గా రానుంది. షియోమీ లాంచ్ చేయబోయే అద్భుతమైన ఉత్పత్తి ఇదేనని తెలుస్తోంది. షియోమీ తర్వాతి తరం ప్రీమియం స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని లీజున్ పేర్కొన్నారు. అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ రానుందని తెలిపారు.

అయితే దీనికి సంబంధించిన మిగతా వివరాలేవీ తెలియ రాలేదు. అయితే ఈ ఫోన్ తాజాగా గీక్ బెంచ్ లిస్టింగ్‌లో కనిపించింది. ఇందులో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ M2012K11C మోడల్ నంబర్‌తో ఈ లిస్టింగ్‌లో కనిపించింది. కనీసం 6 జీబీ ర్యామ్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న క్యూహెచ్‌డీ+ డిస్ ప్లేను అందించననున్నారు. ఎంఐ 11, ఎంఐ 11 ప్రోలు జనవరిలో లాంచ్ కానున్నాయి. ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. ఈ రెండిట్లోనూ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. ఎంఐ 11 మాత్రమే కాకుండా మరిన్ని ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఈ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది. అసుస్, బ్లాక్ షార్క్, లెనోవో, ఎల్జీ, మెయిజు, మోటొరోలా, నుబియా, రియల్ మీ, వన్ ప్లస్, ఒప్పో, వివో స్మార్ట్ ఫోన్లు ఈ ప్రాసెసర్‌తో ఫోన్లు లాంచ్ చేయనున్నాయి.

Tags :
|

Advertisement