Advertisement

  • రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై షియోమీ భారీ తగ్గింపు

రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై షియోమీ భారీ తగ్గింపు

By: chandrasekar Mon, 14 Dec 2020 8:28 PM

రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై షియోమీ భారీ తగ్గింపు


రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై షియోమీ భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.16,999 నుంచి రూ.13,999కు వచ్చేసింది. ఒక్కసారిగా రూ.3,000 తగ్గింపును అందిస్తోంది. రెండు వేరియంట్లపై తగ్గింపు ధర లభించింది.

రెడ్ మీ నోట్ 9 ప్రో ధర మరియు స్పెసిఫికేషన్లు...

ఈ స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 నుంచి రూ.14,999కు తగ్గిపోయింది.

ఈ ఫోన్ అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండగా, దీన్ని రూ.13,999కు తగ్గించారు.

దీనిలో వెనకవైపు నాలుగు కెమెరాలు ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లను కూడా దీనిలో అందించారు.

సెల్ఫీ ప్రియుల కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

దీనిలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందించారు.

ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ పై రెడ్ మీ నోట్ 9 ప్రో పనిచేయనుంది. ఇస్రో నావిగేషన్ సిస్టం నావిక్ సపోర్ట్ ను కూడా ఇందులో అందించారు.

బ్యాటరీ సామర్థ్యం 5,020 ఎంఏహెచ్ గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ఈ ఫోన్ 0.88 మిల్లీమీటర్ల మందం కలిగి ఉంది.

4జీ వోల్టే, వైఫై 802.11ac, బ్లూటూత్ v5.0, ఇన్ ఫ్రారెడ్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Tags :
|
|

Advertisement