Advertisement

  • రిటైర్మెంట్ ప్రకటించిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్

రిటైర్మెంట్ ప్రకటించిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్

By: Sankar Mon, 22 June 2020 6:33 PM

రిటైర్మెంట్ ప్రకటించిన డబ్ల్యూడబ్ల్యూఈ  సూపర్ స్టార్



డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ ను అభిమానించే వారికి ఒక చేదు వార్త ..తన అద్భుత రెజ్లింగ్ విన్యాసాలతో గత మూడు దశాబ్దాలుగా అభిమానులను విశేషంగా అలరించిన ప్రఖ్యాత రెజ్లర్‌ ది అండర్టేకర్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. దాదాపు 30 ఏళ్లుగా రెజ్లింగ్‌లో ఫీల్డ్‌లో ఉన్న అండర్టేకర్‌.. ది లాస్ట్‌ రైడ్‌ డాక్యూ సిరీస్‌ చివరి ఎపిసోడ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నాకు మరోసారి రెజ్లింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టాలనే కోరిక లేదు. నేను గెలవడానికి ఏమి లేదు. నేను సాధించేది కూడా ఏమి లేదు. ప్రస్తుతం ఆట మారింది. ఇది కొత్తవారు రావడానికి సరైన సమయం. ఈ డాక్యూమెంటరీ నాకు చాలా సాయం చేసిందని భావిస్తున్నాను. ఇది ఒక రకంగా నా కళ్లు తెరిపించింద’ని పేర్కొన్నారు..

ఇదే విషయాన్ని అండర్టేకర్‌ ట్విటర్‌ ద్వారా కూడా వెల్లడించారు. రెజ్లింగ్‌లో తన ప్రయాణం ముగిసిందని పేర్కొన్నారు. ఇక మిగిలిన జీవితంలో తన శ్రమకు దక్కిన ఫలాలను అస్వాదించనున్నట్టు తెలిపారు. మరోవైపు అండర్టేకర్‌ రిటైర్‌మెంట్‌పై డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌ సోషల్‌ మీడియాలో పలు పోస్ట్‌లు చేసింది. అండర్టేకర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్‌ చేసింది. కాగా, అండర్టేకర్‌ తన చివరి మ్యాచ్‌లో ఏజే స్టైల్స్‌తో తలపడ్డారు.

అయితే అండర్టేకర్‌ రిటైర్మెంట్ పై ఐపీయల్ దిగ్గజ టీం ముంబై ఇండియన్స్ స్పందించింది ..ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వరల్డ్‌ హేవీ వెయిట్‌ చాంపియన్‌షిప్‌ బెల్ట్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. 30 అద్భుతమైన సంవత్సరాలు పేర్కొన్న ముంబై ఇండియన్స్‌.. థాంక్యూ టేకర్‌ అని పేర్కొంది.

Tags :
|

Advertisement