Advertisement

  • ఆధారాల ‌ఆన‌వాళ్ల‌ను తుడిచిపెట్టిన వుహాన్ అధికారులు

ఆధారాల ‌ఆన‌వాళ్ల‌ను తుడిచిపెట్టిన వుహాన్ అధికారులు

By: chandrasekar Tue, 28 July 2020 09:51 AM

ఆధారాల ‌ఆన‌వాళ్ల‌ను తుడిచిపెట్టిన వుహాన్ అధికారులు


చైనాలోని వుహాన్ న‌గరం క‌రోనా వైర‌స్‌కు కేంద్ర బిందువు అని అందరికి తెలిసిన విషయమే. అయితే ఆ న‌గ‌రంలోని ప్ర‌భుత్వ అధికారులు క‌రోనా వైర‌స్ కేసుల‌కు సంబంధించిన ఆన‌వాళ్ల‌ను తుడిచిపెట్టిన‌ట్లు చైనాకు చెందిన ఓ డాక్ట‌ర్ ఆరోపిస్తున్నారు. వుహాన్‌లో వైర‌స్ కేసుల‌ను ప్రొఫెస‌ర్ క్వాక్ యుంగ్ యువెన్ ద‌ర్యాప్తు చేశారు. అయితే స్థానిక అధికారులు మొద‌ట్లో భౌతిక ఆధారాల‌ను నాశ‌నం చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

క్లినిక‌ల్ డేటాను కూడా రిలీజ్ చేయ‌డంలో ఆల‌స్యం చేసిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. వుహాన్‌లోని హువ‌న‌న్ సూప‌ర్‌మార్కెట్‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ మార్కెట్‌ను పూర్తిగా శుభ్రం చేసేశార‌ని, అంటే క్రైమ్‌సీన్ క్లియ‌ర్ అయ్యింద‌ని, దాంతో ఆ మార్కెట్ నుంచి మ‌నుషుల‌కు వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న హోస్ట్‌ను గుర్తించ‌లేక‌పోయామ‌ని ఆ ప్రొఫెస‌ర్ తెలిపారు. వుహాన్ అధికారులు వైర‌స్ కేసుల‌ను క‌ప్పిపుచ్చేందుకు ప్ర‌య‌త్నించి ఉంటార‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు.

వైర‌స్ స్ట‌డీ కోసం చేయాల్సిన ప‌నుల‌ను అధికారులు అడ్డుకున్న‌ట్లు చెప్పారు. వైర‌స్‌ను నియంత్రించ‌డంలో చైనా విఫ‌ల‌మైన‌ట్లు తొలుత ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. వైర‌స్ గురించి బ‌హిర్గ‌తం చేసిన‌ ఓ డాక్ట‌ర్‌ను అరెస్టు చేయ‌డంతో ఆ దేశంపై మ‌రింత అనుమానాలు వ్యాపించాయి. అయినా మ‌హ‌మ్మారికి సంబంధించి ఎటువంటి స‌మాచారాన్ని కూడా దాచిపెట్ట‌లేద‌ని చైనా చెబుతూనే ఉంది.

Tags :
|
|
|

Advertisement