Advertisement

  • ఎలిమినేటర్ మ్యాచ్ లో కనిపించని వృద్ధిమాన్ సాహా

ఎలిమినేటర్ మ్యాచ్ లో కనిపించని వృద్ధిమాన్ సాహా

By: chandrasekar Sat, 07 Nov 2020 2:23 PM

ఎలిమినేటర్ మ్యాచ్ లో కనిపించని వృద్ధిమాన్ సాహా


ఐపీల్ 2020 సీజన్లో లో హైదరాబాద్ కు ఎలిమినేటర్ మ్యాచ్ లో కనిపించని వృద్ధిమాన్ సాహా కనిపించక పోవడంతో అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఐపీఎల్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ చాలా కీలకం. ఆ మ్యాచ్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌లో ముందుకు వెళ్తారు. లేదంటే టోర్నీ నుంచి ఇంటికి వెళ్లిపోతారు. అలాంటి కీలకమైన మ్యాచ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా దూరమయ్యాడు. అతడు జట్టులోకి వచ్చిన తర్వాత వార్నర్ టీమ్ వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచింది. ఆ మూడు మ్యాచ్‌ల్లో కలిపి ఏకంగా 184 రన్స్ చేశాడు వృద్ధిమాన్ సాహా. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 87, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై 39, ముంబై ఇండియన్స్‌పై 58 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ స్కోర్స్ చూస్తేనే అర్ధమవుతోంది హైదరాబాద్ కి అతడు ఎంత కీలకమో.

మంచి ఫారంలో ఉండడంతో వేగంగా ఎక్కువ పరుగులు సాధించిన అలాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఎంతో ముఖ్యమైన ఎలిమినేటర్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తుది జట్టులో సాహాను ఎందుకు తీసుకోలేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతడి స్థానంలో శ్రీవత్స్ గోస్వామిని ఎందుకు జట్టు లోకి తీసుకోవాల్సి వచ్చిందని ట్వీట్స్ చేస్తున్నారు. ఐతే వృద్ధిమాన్ సాహాపై టాస్ సమయంలోనే క్లారిటీ ఇచ్చాడు హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. గాయం కారణంగా అతడిని జట్టులోకి తీసుకోలేదని సాహా స్థానంలో శ్రీవత్స్ గోస్వామి వచ్చాడని తెలిపాడు. కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో కేవలం 4 మ్యాచ్‌లు ఆడిన వృద్దిమాన్ సహా 71.33 యావరేజీతో 214 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. హైదరాబాద్ కు ఓపెనర్ గా మంచి ప్రారంభాన్ని అందించడంవల్ల ఇతడు మ్యాచ్లను గెలిపించగలిగాడు.

Tags :
|

Advertisement