Advertisement

  • ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్లు దాటిన కరోనా బాధితులు ..

ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్లు దాటిన కరోనా బాధితులు ..

By: Sankar Thu, 17 Sept 2020 12:06 PM

ప్రపంచ వ్యాప్తంగా మూడు కోట్లు దాటిన కరోనా బాధితులు ..


ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. క‌రోనా విజృంభ‌ణ‌తో 3 కోట్ల మందికి పైగా క‌రోనా బారిన‌ప‌డ్డారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,00,31,976 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. క‌రోనాతో 9,45,066 మంది మ‌ర‌ణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 72,87,262 మంది చికిత్స పొందుతుండ‌గా, 2,17,99,648 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

అమెరికాలో కొత్త‌గా 36 వేల కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం క‌రోనా కేసులు 68,28,301కి చేరాయి. నిన్న 1023 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్తం మృతులు 2,01,348కి చేరారు. భార‌త్‌లో 51,15,893, బ్రెజిల్‌లో 44,21,686, ర‌ష్యాలో 1,79,519 క‌రోనా బాధితులు ఉన్నారు. పెరూలో 7.38 ల‌క్షలు, కొలంబియాలో 7.3 ల‌క్ష‌లు, మెక్సికోలో 6.76 ల‌క్ష‌ల మంది, ద‌క్షిణాఫ్రికాలో 6.53 ల‌క్ష‌ల మందికి క‌రోనా వైర‌స్ సోకింది. మ‌ర‌ణాల రేటులో ప్ర‌పంచంలో మెక్సికో నాలుగో స్థానంలో ఉన్న‌ది.

ఇక మన దేశంలో కొత్తగా 97,894 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 1,132మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 51,18,254కు చేరుకున్నాయి. మొత్తం మృతుల సంఖ్య 83,198కి పెరిగింది. వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటి వరకు 40,25,079 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 10,09,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 78.64 శాతం ఉండగా.. మరణాల రేటు 1.63శాతంగా నమోదైంది. ఇక దేశంలో ఇప్పటి వరకు 6,05,65,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌ విడుదల చేసింది

Tags :
|
|

Advertisement