Advertisement

  • కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

By: Sankar Fri, 04 Sept 2020 8:44 PM

కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ


కరోనా వ్యాక్సిన్ విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ కీలక వాక్యలు చేసింది.. వచ్చే ఏడాది మధ్య వరకు విస్తృత స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ కుదరదని స్పష్టం చేసింది. ప్రస్తుతం వివిద దశల్లో ఉన్న వ్యాక్సిన్‌లేవి తాము సూచించిన ప్రమాణాల్లో కనీసం 50 శాతం కూడా సాధించలేదని తెలిపారు. ఈ సం‍దర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ మాట్లాడుతూ.. ‘వచ్చే ఏడాది మధ్య వరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని మేం భావించడం లేదు’ అన్నారు.

అంతేకాక ‘వ్యాక్సిన్‌ అభివృద్ధిలో మూడవ దశ హ్యూమన్‌ ట్రయల్స్‌కు చాలా సమయం పడుతుంది. ఈ దశలో వేల మంది మీద వ్యాక్సిన్‌ని ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని రియాక్షన్‌ ఏంటో చూడాలి. సదరు వ్యాక్సిన్‌ సురక్షితమా కాదా తేల్చాలి. ఇదంతా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది.

అందుకే వచ్చే ఏడాది మధ్య వరకు వ్యాక్సిన్‌ పంపిణీ కుదరదు’ అన్నారు. అంతేకాక ప్రయోగాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలించాలి. ఇతర వాటితో పోల్చి చూడాలి అన్నారు. ఇప్పటికే చాలా మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. వాటి ఫలితాలు ఇంకా తెలియలేదు. సదరు వ్యాక్సిన్‌లు సురక్షితమో కాదో తేలాల్సి ఉంది అన్నారు హారిస్‌

Tags :
|
|

Advertisement