Advertisement

  • ప్రపంచ ఫుట్‌బాల్ వీరుడు డిగో మారడోనా కన్నుమూత

ప్రపంచ ఫుట్‌బాల్ వీరుడు డిగో మారడోనా కన్నుమూత

By: chandrasekar Thu, 26 Nov 2020 11:39 AM

ప్రపంచ ఫుట్‌బాల్ వీరుడు డిగో మారడోనా కన్నుమూత


గుండెపోటుతో ప్రపంచ ఫుట్‌బాల్ వీరుడు డిగో మారడోనా కన్నమూసారు. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా బుధవారం కన్నుమూశారు. బుధవారం, నవంబర్ 25 న ఆయన తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. ఆయన వయసు 60 ఏళ్లు. గత అక్టోబర్ 30నే ఆయన తన 60వ పుట్టిన రోజును జరుపుకొన్నారు. 1960 అక్టోబర్ 30న మారడోనా జన్మించారు. మారడోనాకు వైద్యులు నెల కిందటే మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేశారు. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల మారడోనాకు మెదడులో రక్తం గడ్డకట్టిందని ఆయనకు సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు.

అయన సర్జరీ తరువాత ఆ ప్రమాదం నుంచి కోలుకున్నా అనతి కాలంలోనే ఆయన ఈ లోకం నుంచి వెళ్లిపోవడం కోట్లాది అభిమానుల కంటతడి పెట్టిస్తోంది. మారడోనా అస్తమించడంతో ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఒక శకం ముగిసినట్లైంది. ఫుట్‌బాల్ పేరు చెబితే మొదటగా గుర్తొచ్చే పేరు డిగో మారడోనా. ఆ క్రీడను అంతలా ప్రభావితం చేశారాయన. అర్జెంటీనాకు ఎన్నో విజయాలు అందించారు. 1986లో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రపంచకప్ దక్కించుకోవడంలో డిగో మారడోనా కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీ తర్వాత మారడోనా పేరు మార్మోగిపోయింది. మారడోనా మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దీనివల్ల అయన అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.

Tags :
|
|

Advertisement