Advertisement

ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం పొడిగింపు

By: chandrasekar Tue, 09 June 2020 7:13 PM

ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం పొడిగింపు


కరోనా కారణంగా అతలాకుతలమైన ప్రజలు చాలామంది వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. ఇందులో అధిక మంది ఐటీ సంస్థల ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో వర్క్‌ ఫ్రం హోంను మరో నాలుగు నెలలు పెంచే దిశగా ఐటీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బు‌క్‌ సంస్థలు ఈ విషయాన్ని ప్రకటించాయి. దేశంలో కూడా ఎక్కువ ఐటీ కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి.

అమెజాన్‌ అక్టోబర్‌ 2 వరకు ప్రకటించగా 2020 ఏడాది చివరి వరకు ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంను ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ పరిస్థితులపై తెలంగాణ ఐటీ ఉద్యోగల అసోసియేషన్‌ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ౩౦కి పైగా ఐటీ సంస్థల ఉద్యోగులు ఆఫీసుల నుంచి పని చేయడానికే మక్కువ చూపుతున్నారని సర్వేలో తేలింది. అలాగే వర్క్‌ ఫ్రం హోం పైన కూడా మక్కువ చూపుతున్నారని తెలిసింది.

Tags :
|
|

Advertisement