Advertisement

  • పీసీసి చీఫ్ ముందే కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం...

పీసీసి చీఫ్ ముందే కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం...

By: Sankar Tue, 08 Sept 2020 8:12 PM

పీసీసి చీఫ్ ముందే కాంగ్రెస్ నేతల మాటల యుద్ధం...


వచ్చే ఏడాది జీహెచ్ఎంసి కి ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నది. జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎలాంటి ప్లాన్ ను అమలు చేయాలి అనే విషయాలపై చర్చించారు.

ప్లాన్ గురించి నేతలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దాసోజు శ్రవణ్, నిరంజన్ ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. పీసీసీ ఏం చెబుతుందో వినాలంటూ దాసోజు శ్రవణ్‌కు నిరంజన్ చెప్పడం గొడవకు మూలమైంది. మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావంటూ దాసోజు శ్రవణ్ ఆయనపై ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య మాటా మాటా పెరిగి, బూతులు తిట్టుకొనే వరకూ వెళ్లింది. ఒకరినొకరు కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.

ఇంతలో ఉత్తమ్ జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేయడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగిందిఈ మాటల యుద్ధం క్రమంగా పెరిగి పెద్దదయ్యి బూతులు తిట్టుకునే వరకు వెళ్ళింది. నేతలు సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశారు. గాంధీ భవన్ లో జరిగిన ఈ సంఘటనపై మాజీ కాంగ్రెస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడు. పార్టీలో నేతలు పద్దతి, ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తున్నారని అయన అసహనం వ్యక్తం చేశాడు

Tags :
|
|

Advertisement