Advertisement

  • త‌మ చీర‌ల‌తో ఇద్దరి యువ‌కుల‌ ప్రాణాలను కాపాడిన మ‌హిళ‌లు

త‌మ చీర‌ల‌తో ఇద్దరి యువ‌కుల‌ ప్రాణాలను కాపాడిన మ‌హిళ‌లు

By: chandrasekar Wed, 12 Aug 2020 09:52 AM

త‌మ చీర‌ల‌తో ఇద్దరి యువ‌కుల‌ ప్రాణాలను కాపాడిన మ‌హిళ‌లు


రోడ్డు మీద ఎదైనా దుర్ఘటన జరిగితే వారిని కాపాడాల్సింది పోయి సెల్ఫీలంటూ ఫోజులిచ్చే ఈ రోజుల్లో త‌మ మానం పోతుంద‌ని కూడా ఆలోచించ‌కుండా నీటిలో మునిగిపోతున్న యువ‌కుల‌ను కాపాడారు. ఈ మ‌హిళ‌ల‌కు చేసినా త‌క్కువే అవుతుంది.

అస‌లు విషయం ఏమిటంటే త‌మిళ‌నాడులోని పెరంబ‌లూర్ జిల్లా కొట్ట‌రాయ్ స‌మీపంలోని సిరువ‌చ్చుర్ అనే గ్రామంలో 12 మంది యువ‌కులు క్రికెట్ ఆడుతున్నారు. ఆట పూర్త‌య్యాక కొట్ట‌రాయ్ జ‌లాశ‌యం వ‌ద్ద‌కు చేరుకొని సేద‌తీరుదాం అనుకున్నారు. అక్క‌డున్న మ‌హిళ‌లు బ‌ట్ట‌లు ఉతికి ఆరేసి వెళ్తున్నారు. వారు ఇక్క‌డ స్నానం చేయొచ్చా అని అడిగారు.

అది 20 అడుగుల ఎత్తు వ‌ర‌కు నీరు చేరింది. దిగితే చాలా ప్ర‌మాదం అని చెప్పేలోపే ఇద్ద‌రు కాలు జారి డ్యామ్‌లో ప‌డిపోయారు. వారిని కాపాడేందుకు మ‌రో ఇద్ద‌రు నీటిలోకి దూకారు. వీరికి ఈత రాక‌పోవ‌డంతో మునిగిపోతున్నాం కాపాడండంటూ పెద్దగా కేకలు పెట్టారు.

దీంతో అక్క‌డున్న మ‌హిళ‌లు మ‌ఋ నిముషం ఆలోచించ‌కుండా త‌మ వంటి మీద ఉన్న చీర‌ల‌ను తాడులుగా ఉప‌యోగించి వీరే నీటిలోకి దిగి యువ‌కుల‌ను ర‌క్షించారు. కానీ ఇద్ద‌రు బ‌తికారు, మ‌రో ఇద్ద‌రు వారి క‌ళ్ల ముందే నీటిలో మునిగి చ‌నిపోయారు. వీరు సాహసం చేయ‌క‌పోయి ఉంటే ఆ ఇద్ద‌రు కూడా బ‌తికేవారు కాదంటున్నారు.

Tags :
|

Advertisement