Advertisement

  • ఫ్రీ ఫుడ్ కోసం ఆర్డర్ ఇస్తే అకౌంట్లో యాబై వేలు మాయం

ఫ్రీ ఫుడ్ కోసం ఆర్డర్ ఇస్తే అకౌంట్లో యాబై వేలు మాయం

By: Sankar Mon, 28 Dec 2020 7:10 PM

ఫ్రీ ఫుడ్ కోసం ఆర్డర్ ఇస్తే అకౌంట్లో యాబై వేలు మాయం


ఒక ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే మరొకటి ఫ్రీ అన్న ప్రకటనకు ఆశపడిన ఒక మహిళ రూ.50 వేలు పోగొట్టుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. సవిత శర్మ అనే 58 ఏండ్ల మహిళ ‘ఒక ఫుడ్‌ ఆర్డర్‌కు మరొకటి ఫ్రీ’ అన్న ప్రకటనను ఫేస్‌బుక్‌లో చూశారు.

అందులో పేర్కొన్న నెంబర్‌కు కాల్‌ చేసి రూ.250కి రెండు ఫుడ్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఆమెతో మాట్లాడిన వ్యక్తి తొలుత రూ.10 చెల్లించాలని, ఫుడ్‌ డెలివరీ అప్పుడు మిగతాది చెల్లించాలని చెప్పాడు. అనంతరం ఆమె మొబైల్‌కు ఒక లింక్‌ పంపాడు. దానిని తెరిచిన ఆ మహిళ అందులో అడిగిన బ్యాంకు డెబిట్‌ కార్డ్‌తో పాటు పిన్‌ వివరాలు కూడా పేర్కొన్నారు.

దీంతో కొన్ని సెకండ్లలోనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.49,996 డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఆ నెంబర్‌కు తిరిగి ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ అని వచ్చింది. దీంతో ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రకటన చూసి మోసపోయినట్లు గ్రహించిన ఆమె.. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags :
|
|
|
|

Advertisement