Advertisement

  • పెళ్లి వద్దు అని ఇంటి నుంచి పారిపోయి ఏడేళ్ల తర్వాత కలెక్టర్ గా తిరిగొచ్చిన యువతి

పెళ్లి వద్దు అని ఇంటి నుంచి పారిపోయి ఏడేళ్ల తర్వాత కలెక్టర్ గా తిరిగొచ్చిన యువతి

By: Sankar Tue, 15 Sept 2020 5:32 PM

పెళ్లి వద్దు అని ఇంటి నుంచి పారిపోయి ఏడేళ్ల తర్వాత కలెక్టర్ గా తిరిగొచ్చిన యువతి


చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకొమ్మని తండ్రి వేధిస్తుంటే ఆ వేధింపులు భరించలేక ఇంటి నుంచి పారిపోయిన ఒక యువతీ ఏడేళ్ల తర్వాత మల్లి ఇంటికి వచ్చింది..పారిపోయినప్పుడు సాధారణ యువతిగా వెళ్ళింది, కానీ తిరిగి వచ్చేప్పుడు మాత్రం కలెక్టర్ అయి వచ్చింది..మీరట్ కు చెందిన 28 ఏళ్ల సంజు రాణి వర్మ తల్లి 2013 లో కన్నుమూసింది. దాంతో చదువులను నిలిపివేసిన తండ్రి సంజు రాణికి పెండ్లి చేసేందుకు నిర్ణయించింది.

అయితే పెండ్లి చేసుకునేందుకు ఒప్పుకోలేదు సరికదా.. కుటుంబసభ్యులను వ్యతిరేకించి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటికే డిగ్రీ పూర్తిచేసిన సంజు రాణి.. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి పీజీ చదివింది. అనంతరం యూపీఎస్సీ పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాలలో ర్యాంకు సంపాదించి కలెక్టర్ అయింది. ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్తూ, ప్రైవేట్ ఉద్యోగం చేసింది. ఏడేండ్ల పాటు కష్టించి చదివి తాను అనుకున్నది సాధించింది.

ఇంటిని విడిచివెళ్లాలని నేను తీసుకున్న నిర్ణయంతో కుటుంబ సభ్యులందరూ కోపంగా ఉన్నారు. అయితే అప్పుడు తిట్టిన వారే ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు. యూపీఎస్సీ అధికారి కావడం సంతోషంగా ఉంది. కుటుంబం పట్ల నా బాధ్యత ఏమిటో నాకు తెలుసు. ఇప్పుడు నేను నా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదరిస్తాను. అమ్మాయిలను చదువుకోనీయకుండా పెండ్లి పేరుతో ఒత్తిళ్లు మానుకోవాలి. వారి దారి వారు ఎంచుకునే స్వేచ్ఛను వారికిచ్చినప్పుడే భవిష్యత్ బంగారమయంతా తయారవుతుందని నమ్ముతాను" అని చెప్తున్నారు సంజు రాణి వర్మ. తనలాగే అందరూ ఉన్నత విద్య చదువుకుని కలలు నిజం చేసుకోవాలని యువతకు సంజూ రాణి సందేశమిస్తున్నది.

Tags :
|
|

Advertisement