Advertisement

మహిళ వేధింపు కేసు...బాలీవుడ్ నటుడు అరెస్ట్...

By: chandrasekar Wed, 04 Nov 2020 7:00 PM

మహిళ వేధింపు కేసు...బాలీవుడ్ నటుడు అరెస్ట్...


ఈ మధ్య అమ్మాయిలను వేధించడం అనేది మరీ ఎక్కువైపోతుంది. తాజాగా బాలీవుడ్ నటుడు విజయ్ రాజ్ ఇదే కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈయనకు బాలీవుడ్‌లో బాగానే గుర్తింపు ఉంది. 57 ఏళ్ళ ఈ నటుడు రన్‌, భోపాల్ ఎక్స్‌ప్రెస్‌, రఘు రోమియో, గులాబో సితాబో లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన్ని గోండియా పోలీసులు నవంబర్ 2 సాయంత్రం అరెస్ట్ చేశారు. తను నటిస్తున్న సినిమా సెట్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను వేధించాడనే కారణంతో విజయ్‌ను అరెస్ట్ చేసారు పోలీసులు. ఆ వెంటనే ఈ కేసులో బెయిల్ కూడా పొందాడు.

మహారాష్ట్రలోని గోండియాలో విద్యా బాలన్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'షేర్ని' షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ రాజ్ కూడా నటిస్తున్నాడు. గత 15 రోజులుగా ఆ సినిమా షూటింగ్ నిమిత్తం గోండియాలోని గేట్‌వే హోటల్‌లో విజయ్ రాజ్ ఉంటున్నాడు. అయితే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో షూటింగ్ జరుగుతున్నపుడు అలాగే గోండియాలోని హోటల్‌లో ఉన్నపుడు కూడా తనపై విజయ్ రాజ్ అత్యంత అభ్యంతరకరంగా ప్రవర్తించాడని వేధింపులకు గురిచేశాడని 30 సంవత్సరాల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసి౦ది. ఆమె కూడా అదే సినిమా కోసం పని చేస్తుంది. దాంతో వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. గోండియాలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్ 354 (ఏ, డి) కింద విజయ్ రాజ్‌పై కేసు నమోదైంది. బాలీవుడ్‌లో దాదాపు 50 సినిమాలకు పైగానే నటించాడు. ఈయనకు నటుడిగా మంచి పేరుంది. రన్ సినిమాలో "కౌవా బిర్యానీ" సీన్‌తో బాగా పాపులర్ అయ్యాడు. ఇదే సీన్ తెలుగులో సునీల్ చేసాడు. ఇక్కడ కాకి బిర్యానీగా ఈ సీన్ వచ్చింది. విజయ్ రాజ్ అరెస్ట్ న్యూస్ బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

Tags :
|
|

Advertisement