Advertisement

యాచకురాలి అకౌంట్ లో 1.4 కోట్లు ....

By: Sankar Sun, 01 Nov 2020 9:39 PM

యాచకురాలి అకౌంట్ లో 1.4 కోట్లు ....


ఆమె యాచకురాలిగా జీవిస్తోంది. ప్రతిరోజూ రోడ్డుపై వీల్ చైర్ లో కూర్చొని వచ్చిపోయే వారి యాచిస్తుంటుంది. ప్రజలు దయతో ఇచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తోంది.

అయితే, ఆమెపై కొందరికి అనుమానం కలిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆమె గురించి అనేక విషయాలు వెలుగుచూశాయి. ఆమె మామూలు యాచకురాలు కాదు. కోట్లకు పడగలెత్తిన యాచకురాలు. ప్రతిరోజూ రోడ్డుపై వీల్ చైర్ లో కూర్చొని యాచిస్తూ, సాయంత్రం వెళ్లే సమయంలో నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఇదే ఆమెను పట్టించింది.

పోలీసుల దర్యాప్తులో ఆమెకు గర్భియా, ఖలిబుయా గవర్నెట్స్ లో ఐదు నివాస భవనాలు ఉన్నట్టు తేలింది. అంతేకాదు ఆమెకు చెందిన మూడు బ్యాంక్ అకౌంట్స్ లో రూ.1.42 కోట్ల రూపాయలు నగదు ఉన్నట్టుగా విచారణలో తేలింది. దీంతో ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags :
|
|

Advertisement