Advertisement

మాస్క్ లేకుంటే నో ఎంట్రీ...!

By: Anji Mon, 28 Sept 2020 11:26 AM

మాస్క్ లేకుంటే నో ఎంట్రీ...!

నేడు, రేపు రెండు రోజుల పాటు జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్ పరీక్ష జరగ్గా.. రెండో పేపర్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.

కొవిడ్ నేపథ్యంలో ప్రతి విద్యార్థిని మాస్కు ధరించి శానిటేషన్ చేసుకున్న తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 84 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 67, ఏపీలో 17 కలిపి మొత్తం 84 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. గతంలో ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ విభాగాలకు ఒకే దఫాలో నిర్వహించగా.. ఈ ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా.. వేర్వేరుగా నిర్వహిస్తున్నారు.


మరో వైపు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్) కూడా నేడు జరగనుంది. దీనికి దేశవ్యాప్తంగా 77వేల మంది హాజరుకానున్నారు. ఇంకా ఫార్మా విద్యకు పేరుపొందిన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన సంస్థ(నైపర్లు)ల్లో ఎంబీఏ, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తం నైపర్ జేఈఈ పరీక్ష కూడా సోమవారమే జరగనుంది.

Tags :

Advertisement