Advertisement

  • బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే కరోనా ఆసుపత్రిలో సేవ చేయాలి ..గ్వాలియర్ నగర అధికారుల సరికొత్త రూల్

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే కరోనా ఆసుపత్రిలో సేవ చేయాలి ..గ్వాలియర్ నగర అధికారుల సరికొత్త రూల్

By: Sankar Mon, 06 July 2020 7:21 PM

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే కరోనా ఆసుపత్రిలో సేవ చేయాలి ..గ్వాలియర్ నగర అధికారుల సరికొత్త రూల్



కరోనా మహమ్మారి ఇప్పట్లో తగ్గే సూచనలు కనపడట్లేదు , అంతే కాకుండా వాక్సిన్ రావడానికి కూడా ఇంకా చాలా కాలం పట్టేలా ఉంది ..ఆ లోపు స్వీయ నియంత్రణ , సోషల్ డిస్టెన్స్ వంటివి పాటిస్తూ , మాస్క్ లు పెట్టుకుంటూ మన జాగ్రత్తలో మనం ఉండాలి ..అయితే కరోనా ఎంత విజురంబిస్తున్న ప్రజలు ఎవ్వరు సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించడం లేదు , మాస్క్ లు అంతగా ఎవరు ధరించడం లేదు ..దీనితో రాష్ట్రాలు కొత్త కొత్త రూల్స్ తెస్తూ ప్రజలకు అవగహన కల్పిస్తున్నాయి ..

తాజాగా కరోనా కట్టడి కోసం గ్వాలియర్ నగర అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం నిబంధనలు పాటించేలా చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని పౌరులు స్థానిక కరోనా ఆస్పత్రిలోనూ, పోలీస్ చెక్ పోస్టుల వద్ద మూడు రోజుల పాటు వలంటీర్లుగా సేవ చేయాలని అక్కడి అధికారులు ప్రకటించారు.

కొవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించేవారిపై జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా ఆటకట్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన కిల్ కరోనా కార్యక్రమంలో భాగంగానే గ్వాలియర్ నగర అధికారులు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. రాష్ట్రంలోని కరోనా రోగులందరినీ గుర్తించేందుకు ఇంటి ఇంటి సర్వే కూడా చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆదివారం నాడు ఆ నగరంలో కొత్తగా 51 కరోనా కేసులు వెలుగు చూడటంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 528కి చేరుకుంది.

Tags :
|
|
|

Advertisement