Advertisement

  • ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయకుండా డిగ్రీలు ఇవ్వలేము ..యూజీసీ

ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయకుండా డిగ్రీలు ఇవ్వలేము ..యూజీసీ

By: Sankar Mon, 10 Aug 2020 7:36 PM

ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయకుండా డిగ్రీలు ఇవ్వలేము ..యూజీసీ



యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. యూజీసీ త‌ర‌పున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా మాట్లాడారు. డిగ్రీలు ప్ర‌దానం చేసే ప్ర‌క్రియ‌లో నియ‌మాల‌ను రూపొందించే హ‌క్కు కేవ‌లం యూజీసిక మాత్ర‌మే ఉంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు యూజీసీ నియ‌మావ‌ళిని మార్చ‌లేవ‌న్నారు.

కోవిడ్19 నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా డిగ్రీలు ఇవ్వ‌లేమ‌న్నారు. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు ఆగ‌స్టు 14కు వాయిదా వేసింది. కోవిడ్ నేప‌థ్యంలో యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. అయితే ఆ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల స్పందించేందుకు యూజీసీకి సుప్రీం కొంత గ‌డువును ఇచ్చింది.

అశోక్ భూష‌న్‌, సుభాష్ రెడ్డి, షాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్న‌ది. సెప్టెంబ‌ర్ 30వ తేదీలోగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని గ‌తంలో యూజీసీ చెప్పింది. యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఓవ‌ర్‌రైడ్ చేస్తుందా అని ఈ సంద‌ర్భంగా సుప్రీం ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. విద్యార్థులు చ‌దువుతూనే ఉండాల‌ని, కానీ వాళ్లు ప‌రీక్ష‌లు రాయ‌నంత వ‌ర‌కు వారికి డిగ్రీలు ఇవ్వ‌లేర‌ని మెహ‌తా తెలిపారు.


Tags :
|
|

Advertisement