Advertisement

  • ఏడు నెల‌ల్లోనే వ్యాక్సిన్ ప్ర‌యోగాలు కీల‌క ద‌శ‌కు చేరుకున్నాయి

ఏడు నెల‌ల్లోనే వ్యాక్సిన్ ప్ర‌యోగాలు కీల‌క ద‌శ‌కు చేరుకున్నాయి

By: chandrasekar Sat, 01 Aug 2020 10:29 AM

ఏడు నెల‌ల్లోనే వ్యాక్సిన్ ప్ర‌యోగాలు కీల‌క ద‌శ‌కు చేరుకున్నాయి


ప్ర‌పంచ‌వ్యాప్తంగా 180కిపైగా క‌రోనా వ్యాక్సిన్ల ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో 26 టీకాలు మాన‌వుల‌పై ప్ర‌యోగ ద‌శ‌కు చేరుకున్నాయి. అయితే క‌రోనా నియంత్ర‌ణ‌కు ఇన్ని వ్యాక్సిన్లు ఎందుక‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతున్న‌ది. కానీ, ఈ వైర‌స్ ప‌లు దేశాల్లో ప‌లు విధాలుగా మార్పులు చెందుతున్న‌ది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా నియంత్ర‌ణ‌కు ఒక‌టి క‌న్నా ఎక్కువ టీకాలు అవ‌స‌ర‌మ‌ని అమెరికన్ ఇమ్యునోలజిస్ట్, యు.ఎస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధిపతి ఆంథోనీ ఫౌసీ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా నాలుగు ప‌రిపూర్ణ వ్యాక్సిన్ల ప‌రి‌శోధ‌న‌లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

చైనీస్ కంపెనీ సినోఫార్మ్, ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా, చైనీస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం సినోవాక్, అమెరికాలోని మోడెర్నా ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్లు ఫౌసీ వెల్ల‌డించారు. సాధార‌ణంగా ఒక టీకా అభివృద్ధికి సుమారు ప‌ది ఏండ్ల స‌మ‌యం ప‌డుతుందని, అయితే క‌రోనా వ్యాప్తిలోకి వ‌చ్చిన ఏడు నెల‌ల్లోనే వ్యాక్సిన్ ప్ర‌యోగాలు కీల‌క ద‌శ‌కు చేరుకున్నాయ‌ని తెలిపారు.

మాన‌వుల‌పై ప్ర‌యోగాలు మూడో ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా క‌రోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌మున్న‌ద‌ని ఫౌసీ చెప్పారు. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు రికార్డు స్థాయిలో కేవ‌లం మూడు నెల‌ల్లో క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌యోగాల‌కు శ్రీకారం చుట్టార‌ని వివ‌రించారు.

Tags :
|

Advertisement