Advertisement

భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ...

By: chandrasekar Sat, 19 Dec 2020 4:18 PM

భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ...


భారత్, చైనా సరిహద్దులో ఎల్ఏసీ వద్ద నుంచి ఇరు దేశాల బలగాలను వెనక్కి రప్పించేందుకు ఇరుదేశాలు ఒప్పుకున్నాయి. సాధ్యమైనంత త్వరలోనే దళాలను వెనక్కి రప్పించాలని ఆకాంక్షించాయి. భారత్, చైనా తరపున ఇరుపక్షాల మిలిటరీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. దళాలను ఉపసంహరించుకోవడంతోపాటు రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఖచ్చితంగా పాటించాలని చైనాకు భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలియ చేసింది. ఈ మేరకు చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు సుముఖత వ్యక్తం చేశాయి. సరిహద్దులో శాంతి పరిస్థితులు నెలకొనేందుకు ఇరుదేశాలు కూడా అంగీకరించాయని వెల్లడించింది.

సరిహద్దులో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత్, చైనాలు భారీ ఎత్తున బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. చివరిసారి సెప్టెంబర్ 30న సరిహద్దు పరిస్థితులపై ఇరు దేశాల మధ్య ఎంసీసీ చర్చలు జరిగాయి. మే నుంచి సరిహద్దులో ఇరుదేశాల దళాలు మోహరించిన విషయం తెలిసిందే. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ...సరిహద్దులో శాంతి పరిస్థితులు నెలకొల్పేందుకు భారత్ తోపాటు తాము కూడా సహకరిస్తామని చైనా చెప్పిందని ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement