Advertisement

  • కాంగ్రెస్ గూటికే పైల‌ట్ రావ‌డంతో రాజ‌స్థాన్ రాజ‌కీయ సంక్షోభానికి తెర‌ప‌డినట్లే...

కాంగ్రెస్ గూటికే పైల‌ట్ రావ‌డంతో రాజ‌స్థాన్ రాజ‌కీయ సంక్షోభానికి తెర‌ప‌డినట్లే...

By: chandrasekar Tue, 11 Aug 2020 6:04 PM

కాంగ్రెస్ గూటికే పైల‌ట్ రావ‌డంతో రాజ‌స్థాన్ రాజ‌కీయ సంక్షోభానికి తెర‌ప‌డినట్లే...


రాహుల్‌, ప్రియాంకా వ‌ద్రాల‌తో భేటీ అయిన మాజీ డిప్యూటీ సీఎం పైల‌ట్ఇవాళ మీడియాతో మాట్లాడారు.స‌చిన్ పైల‌ట్ మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. నెల రోజుల త‌న తిరుగుబాటుపై స్పందిస్తూ రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌లేద‌న్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండేందుకు హైక‌మాండ్ వ‌ద్ద ఎటువంటి పోస్టు డిమాండ్ చేయ‌లేద‌ని కూడా పైల‌ట్ తెలిపారు. త‌న కుటుంబం నుంచి కొన్ని విలువ‌లు నేర్చుకున్నాన‌ని, ఎవ‌రిని ఎంత వ్య‌తిరేకించినా, నేనెప్పుడూ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని పైల‌ట్ అన్నారు. అశోక్ గెహ్లాట్ నాక‌న్నా పెద్ద‌వారు అని, ఆయ‌న్ను వ్య‌క్తిగ‌తంగా గౌర‌విస్తాన‌ని, కానీ ప్ర‌భుత్వ ప‌రంగా ప్ర‌శ్నిస్తాన‌న్నారు.

సీఎం గెహ్లాట్‌పై తిరుగుబాటు చేయ‌డంలో స‌చిన్ పైల‌ట్‌ను డిప్యూటీ సీఎం ప‌ద‌వి నుంచి తొల‌గించారు. మ‌రో 18 మంది రాజ‌స్థాన్ రెబెల్ ఎమ్మెల్యేల‌పై గ‌వ‌ర్న‌ర్ వేటు కూడా వేశారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ గూటికే పైల‌ట్ రావ‌డంతో రాజ‌స్థాన్ రాజ‌కీయ సంక్షోభానికి తెర‌ప‌డిన‌ట్లు అయ్యింది. త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు పైల‌ట్ కుట్ర‌ప‌న్నిన‌ట్లు సీఎం గెహ్లాట్ ఆరోపించిన విష‌యం తెలిసిందే. రాహుల్, ప్రియాంకాల‌తో జ‌రిగిన భేటీలో వాళ్లు త‌న ఫిర్యాదులు విన్న‌ట్లు పైల‌ట్ తెలిపారు. రాజ‌స్థాన్ సంక్షోభానికి వాళ్లు ప‌రిష్కారాన్ని చూప‌నున్న‌ట్లు పైల‌ట్ చెప్పారు. రాజ‌స్థాన్ స‌మస్య‌ను తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ త్రిస‌భ్య క‌మిటీని ఏర్పాటు చేసింది. రాజ‌కీయాల్లో వ్య‌క్తిగ‌త శ‌తృత్వానికి స్థానం లేద‌ని పైల‌ట్ అన్నారు.

Tags :

Advertisement