Advertisement

  • ఆ విషయంలో ధోని పక్కన లేకపోతే కోహ్లీ సక్సెస్ కాలేడు..జాఫర్

ఆ విషయంలో ధోని పక్కన లేకపోతే కోహ్లీ సక్సెస్ కాలేడు..జాఫర్

By: Sankar Sat, 06 June 2020 5:20 PM

ఆ విషయంలో ధోని పక్కన లేకపోతే కోహ్లీ సక్సెస్ కాలేడు..జాఫర్

ప్రపంచ క్రికెట్ లో కొత్త టెక్నాలజీ లో భాగంగా వచ్చిన డెసిషన్ రివ్యూ సిస్టం ను తొలినాళ్లలో వ్యతిరేకించిన ఆటగాళ్లలో టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని ఒకడు..అయితే ఆ తర్వాత కాలంలో ధోని డిఆర్ఎస్ ను వాడటం లో ప్రపంచంలోనే అత్యంత విజయవంతం అయిన ఆటగాడిగా నిలిచాడు ..దీనితో డెసిషన్ రివ్యూ సిస్టం కాస్త ధోని రివ్యూ సిస్టం అనేంత స్థాయిలో ధోని సక్సెస్ అయ్యాడు ..ధోని స్థానం లో కెప్టెన్ అయిన కోహ్లీ మాత్రం ఎందుకో ధోని స్థాయిలో డిఆర్ఎస్ విషయం లో సక్సెస్ కాలేకపోతున్నారు..

ms dhoni,virat kohli,wasim jaffar,drs,dhoni review system ,ధోని,  కోహ్లీ, జాఫర్,   డెసిషన్ రివ్యూ సిస్టం,  డిఆర్ఎస్

ధోని రిటైర్మెంట్ రూమర్స్‌ గురించి వసీమ్ జాఫర్ మాట్లాడుతూ ‘‘ధోనీ గురించి అందరూ అంచనాలు వేయడం సహజం. అతను ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ నెట్స్‌లో అతను ఏ తరహాలో ప్రాక్టీస్ చేశాడో..? కూడా మనం అందరం చూశాం. బహుశా ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ కెరీర్‌పై ఓ క్లారిటీ వస్తుందనుకుంటున్నా. టీ20ల్లో ఇప్పటికీ ధోనీ బెస్ట్ క్రికెటర్. అంతేకాకుండా.. కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి మైదానంలో చాలా విషయాల్లో అతను సాయం చేస్తున్నాడు. ఒకవేళ ధోనీ టీమ్‌లో లేకపోతే చాలా డీఆర్‌ఎస్ రివ్యూలు ఫెయిలవుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని జాఫర్ వెల్లడించాడు.

కచ్చితమైన డిసిషెన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్) రివ్యూలు కోరడంలో ధోనీ తర్వాత ఎవరైనా..! అందుకే అభిమానులు ముద్దుగా డీఆర్‌ఎస్‌ని ధోనీ రివ్యూ సిస్టమ్ అని పిలుస్తుంటారు. 2014లో టెస్టులకి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా.. కోహ్లీ చేతికి టెస్టు టీమ్ పగ్గాలు వచ్చాయి. ఆ తర్వాత 2017లో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా.. కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారాడు. కానీ.. ఇప్పటికీ ధోనీ మైదానంలో ఉంటే.. అతడ్ని సంప్రదించకుండా రివ్యూ కోరే సాహసం కోహ్లీ చేయడు.

Tags :
|

Advertisement