Advertisement

  • కరోనాతో ఆ దేశ ప్రధానమంత్రి తక్కువ వయసులోనే మృతి

కరోనాతో ఆ దేశ ప్రధానమంత్రి తక్కువ వయసులోనే మృతి

By: chandrasekar Mon, 14 Dec 2020 3:58 PM

కరోనాతో ఆ దేశ ప్రధానమంత్రి తక్కువ వయసులోనే మృతి


ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కరోనా వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలోని ఎస్వతిని దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ మండ్వూలో డ్లమిని (52) కరోనా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎస్వతిని ప్రధానిగా అంబ్రోస్ 2018 నవంబరులో నియమితులయ్యారు. నాలుగు వారాల కిందట ఈయన కరోనా వైరస్ సోకడంతో చికిత్స కోసం దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ చివరికి మరణించారని ఎస్వతిని ఉప ప్రధాని తెంబా మసుకు తెలియజేసారు. కరోనాకు మెరుగైన చికిత్స కోసం అంబ్రోస్ ను దక్షిణాఫ్రికాకు తరలించినా కూడా ఫలితం లేకపోయిందని తెంబా ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ సోకిన తర్వాత కొద్ది రోజులు ఎస్వతినిలోనే ప్రధానికి చికిత్స చేశారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగుపడటకపోవడంతో పొరుగున ఉన్న దక్షిణాఫ్రికాకు డిసెంబరు 1న తరలించారు. అంబ్రోస్ మండ్వూలో ప్రధానమంత్రిగా వున్న అతి చిన్న దేశమైన ఎస్వతినిలో సంపూర్ణ రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ కంటే దక్షిణాఫ్రికాలో చికిత్స బాగుంటుందని అక్కడకు తీసుకు వెళ్తే ప్రయోజనం లేకుండా పోయింది.

అంబ్రోస్ మండ్వూలో 2018 లో పోలాండులోని కటోవిస్ నగరంలో జరిగిన ప్రపంచ దేశాల సదస్సులో వాతావరణ మార్పులపై అంబ్రోస్ డ్లమిని ప్రసంగించారు. అయన ప్రధాని కాక ముందు బ్యాంకింగ్ రంగంలో 18 ఏళ్లు పనిచేశారు. అయన నెడ్‌బ్యాంక్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. గత రెండు రోజుల కిందట ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఐసీయూలో చికిత్స కొనసాగించారు. ఆంబ్రోస్‌ను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అయన నిన్న ఆదివారం కన్నుమూశారు. ఈ దేశంలో మొత్తం 1.2 మిలియన్ల జనాభా కలిగి వున్నారు. ఆ దేశంలో ఇప్పటి వరకు 6,768 మంది కరోనా బారిన పడ్డారని అందులో 127 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ దేశ ప్రధాని మృతి చెందడంతో ఆ దేశ ప్రజలు ఆవేదన చెందారు.

Tags :
|
|

Advertisement