Advertisement

  • తెలంగాణలో వైన్ షాప్స్ ఓపెన్ సమయం పెంపు ..ఆనందంలో మందు బాబులు

తెలంగాణలో వైన్ షాప్స్ ఓపెన్ సమయం పెంపు ..ఆనందంలో మందు బాబులు

By: Sankar Mon, 01 June 2020 8:00 PM

తెలంగాణలో వైన్ షాప్స్ ఓపెన్ సమయం పెంపు ..ఆనందంలో మందు బాబులు

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. అదనంగా మరో 2 గంటల పాటు మద్యం అమ్మకాలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల తెలంగాణలో మద్యం షాపులు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా తెలంగాణలో రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు మాత్రమే జన సంచారంపై అంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కూడా రాత్రి 8 గంటల వరకు కొనసాగించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచనున్నారు. దీంతో అదనంగా మరో 2 గంటల పాటు మద్యం కొనుగోలుకు అవకాశం లభించడంతో.. మందుబాబులు సంబరపడుతున్నారు. ఈ నిర్ణయంతో మద్యం కొనుగోళ్లు కొద్దిమేర అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తెలంగాణలో ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా.. అన్ని దుకాణాలు, వ్యాపార సదుపాయాలు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

Tags :
|
|

Advertisement